Begin typing your search above and press return to search.
బెంజ్ నుంచి అవతార్ కార్
By: Tupaki Desk | 8 Jan 2020 1:30 AM GMTఅవతార్ లుక్ లో లగ్జరీ కార్ అందుబాటులోకి వస్తోందా? అంటే అవుననే ప్రకటించింది ప్రఖ్యాత మెర్సిడెస్ బెంజ్ కంపెనీ. కామెరూన్ తెరకెక్కించిన అవతార్ స్ఫూర్తితో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ ని త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు బెంజి సంస్థ సన్నాహకాల్లో ఉంది. దీనిపేరు డైమ్లర్ బెంజ్ అంటూ నేడు లాస్ వెగాస్ లో బెంజ్ షోరూమ్ లో ఆవిష్కరించారు. దీనిని విజన్ అవతార్ అంటూ పిలుస్తున్నారు.
ఈ కార్ ప్రత్యేకత ఏమిటి అంటే 30 డిగ్రీల రేంజులోనే దీని నాలుగు చక్రాలు అటూ ఇటూ కదలగలవు. అక్కడికక్కడే సడెన్ గా టర్న్ తిప్పేయొచ్చు. కారు ఇరుసులు అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇక ఈ కార్ కోసం అల్ట్రా మోడ్రన్ ఆర్గానిక్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ కార్ లో దానంతట అదే నడిచే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇక ఈ కార్ ని అవతార్ దర్శకుడు కామెరూన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కామెరూన్ మాట్లాడుతూ ఇది ప్రాణం ఉన్న కార్. శ్వాస కూడా తీసుకుంటోంది .. కార్ లో కూచుని చూశాను అని వ్యాఖ్యానించారు.
కార్ శ్వాసను తీసుకోవడమా? అదెలా అంటే.. దీనికి వెనకవైపుగా చేప మొప్పల తరహాలో బాడీని డిజైన్ చేయడంతో ఆ తరహా కలరింగ్ తీసుకొచ్చారు. ఇక ఈ కార్ ఎప్పుడు మార్కెట్లోకి రిలీజవుతుందో క్లారిటీ లేదు. దీనికి స్టీరింగ్ లేదు. సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను చేతితో పట్టుకోవడం ద్వారా కార్ ని సునాయాసంగా నడిపేయవచ్చని తెలుస్తోంది. ఇన్ సైడ్ కంప్యూటర్ తెర పూర్తి సౌకర్యంగా ఉంటుంది. వేళ్లతోనే కార్ డైరెక్షన్ ఛేంజ్ చేసేయొచ్చు సులువుగా.