Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కిరాయి సైన్యాలా ?

By:  Tupaki Desk   |   17 Oct 2022 6:15 AM GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కిరాయి సైన్యాలా ?
X
వినటానికే విచిత్రంగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలకపాత్ర కిరాయిసైన్యాలదేనట. ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్ట్ కంపెనీ(పీఎంసీసీ)ల ద్వారా కిరాయి సైనికులు వివిధ దేశాల తరపున యుద్ధాల్లో పాల్గొంటారట. మామూలుగా రెండుదేశాల మధ్య యుద్ధమంటే రెండు దేశాల తరపున సైన్యాలే పాల్గొంటాయని అందరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆయా దేశాల సొంత సైన్యాలతో కలిసి కిరాయి సైన్యాలు కూడా పోరాటాలు చేస్తున్నాయట.

రష్యా, అమెరికా, ఉక్రెయిన్, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సిరియాతో పాటు ఆసియా దేశాలు, ఆఫ్రికాదేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో కిరాయి సైన్యాలదే కీలకపాత్రట. పీఎంసీసీల ఆధ్వర్యంలో వేలాదిమంది కిరాయి సైనికులు పనిచేస్తున్నారట.

వీరిని ఏ దేశం సంప్రదించి ఎంతమంది కిరాయి సైనికులు కావాలి ? ఎంతకాలం అవసరం ? అనే వివరాలతో కాంట్రాక్టు కుదుర్చుకుంటే సరిపోతుందట. కిరాయిసైనికుల సేవలు కావాలని అనుకున్న దేశాలు భారీగా ఖర్చులు చేయాల్సుంటుంది.

యుద్ధభయం ఉన్న చాలాదేశాలు ఇలాంటి కారియిసైనికులను తమ తరపున రంగంలోకి దింపుతున్నాయట. 2003లో ఇరాన్ తో పాటు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా జరిపిన యుద్ధంలో కూడా కిరాయిసైన్యాన్ని ఉపయోగించుకున్నాయట. ఇపుడు రష్యా తరపున సుమారు 20 వేలమంది కిరాయిసైన్యాలు యుద్ధక్షేత్రంలో ఉన్నాయట. అలాగే ఉక్రెయిన్ తరపున అమెరికా ద్వారా కిరాయిసైన్యాలు యుద్ధం చేస్తున్నాయట. కిరాయి సైన్యాలలో ఎక్కువగా కొలంబియా, పనామా, ఎల్ సాల్విడార్, చిలీ తరపున ఎక్కువగా ఉంటారట.

అమెరికా, బ్రిటన్ తరపున కూడా వేలాదిమంది కిరాయిసైన్యాలు ఉన్నప్పటికీ వీళ్ళ సేవలు ఉపయోగించుకోవటం చాలా ఖరీదైన వ్యవహారమట. అందుకనే ఎక్కువగా కొలంబియా, పనామా, చిలీ దేశాల కిరాయిసైన్యాలనే ఉపయోగించుకుంటున్నాయి.

వీటన్నింటితో పాటు వాగ్నర్ గ్రూపు తరపున పనిచేస్తున్న కిరాయిసైన్యాలు చాలా పవర్ ఫుల్లట. అయితే వాగ్నర్ గ్రూపు తరపున పనిచేస్తున్న కిరాయిసైన్యాలు రష్యాకు చెందినవి. ఇదెక్కువగా రష్యా తరపునే ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఏదేమైనా సొంతసైన్యాలు పోయి కిరాయిసైన్యాల పాత్ర పెరిగిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.