Begin typing your search above and press return to search.

'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు' తిరిగింది చాలు.. థ్యాంక్స్‌!!

By:  Tupaki Desk   |   20 Jan 2023 3:41 AM GMT
గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరిగింది చాలు.. థ్యాంక్స్‌!!
X
``మీరు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మన ప్ర‌భుత్వం కార్య‌క్రమంలో అలుపెర‌గ‌కుండా పాల్గొన్నారు. తిరిగింది చాలు.. థ్యాంక్స్‌!!``- ఇదీ.. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి స్థానిక అధికారుల నుంచి వ‌చ్చిన మెసేజ్‌. నిజానికి అధికారులు అంటే.. ప్ర‌భుత్వ‌మే కదా..సో.. ఆయ‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వం అంటే, త‌న సొంత పార్టీ స‌ర్కారునుంచి వ‌చ్చిన సందేశం.

సో.. ఈ నేప‌థ్యంలో ఆనం ఇక, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిర‌గాల్సిన అవ‌స‌రం లేక‌పోగా.. త‌న ప‌నితాను చూసుకోవ‌చ్చ ని సొంత పార్టీ, సొంత ప్ర‌భుత్వం కూడా తేల్చి చెప్పిన‌ట్టు అయింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆనం తీసుకునే నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది. కొన్నాళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు ఆనం. ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని.. క‌నీసం అధికారులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏమొహం పెట్టుకుని ఓట్లు అడ‌గాల‌ని, ముంద‌స్తుకు వెళ్తే మ‌న‌మే మునుగుతాం! అని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు విప‌క్షాల‌కు అస్త్రాలుగా మారాయి.

దీంతో అలెర్ట్ అయిన ప్ర‌భుత్వం వెంట‌నే ఆయ‌నను త‌ప్పించి నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇక్క‌డి ఇంచార్జ్‌గా నియ‌మించిం ది. ఇక‌, ఆ క్ష‌ణం నుంచి ఆనంకు చెక్ పెట్ట‌డం మొద‌లైంది.

ఆనం ఫోన్ చేసినా అధికారులు రెస్పాన్స్ ఇవ్వ‌డంలేదు. అంతేకాదు, ఇంత‌కుముందు ఆనంకు 2+2గా ఉన్న భ‌ద్ర‌త‌ను 1+1 కు కుదించారు. ఈ ప‌రిణామాలు ఒక‌వైపు సెగ‌రేపుతుంటే.. మ‌రోవైపు తాజాగా ఆనంకు.. అధికారుల నుంచి ఇలా మేసేజ్ రావ‌డం మ‌రింత‌గా ఆయ‌న‌ను ఇర‌కాటంలోకి నెట్టిన‌ట్టు అయింది. మ‌రి ఇక ఆనం త‌న దారి తాను చూసుకుంటారేమో చూడాలి!!