Begin typing your search above and press return to search.
క్రిస్టియానో దూకుడుకు మెస్సీ కళ్లెం
By: Tupaki Desk | 17 Sep 2020 12:30 AM GMTఫుట్‌బాల్ ఆటగాళ్లలో పోర్చ్‌గీస్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఎప్పడు ఆటలో ముందే ఉంటారు. ఆటలో అతడిని ఢీకొట్టే వారే లేరు. అప్పడప్పుడు బార్సిలోనా ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ.. క్రిస్టియానోకు పోటీగా వస్తుంటాడు. వీళ్లద్దరూ ఓకరిమీద ఒకరు ఎప్పుడూ పోటీపడుతుంటారు. ఆటల్లోనే కాదండి.. ఆదాయంలోనూ వీళ్లిద్దరూ పోటీపడుతుంటారు. అయితే ఆదాయం విషయంలో ఇప్పటివరకు క్రిస్టియానో రొనాల్డోనే టాప్‌లో ఉండేవారు. కానీ తాజాగా ఫోర్బ్స్ ఇచ్చిన ఓ నివేదిక మాత్రం ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది రూ.922 కోట్లతో మెస్సీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 856 కోట్లతో రోనాల్డో రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తర్వాతి స్థానం లో పిఎస్‌జి యొక్క స్టార్ నేమార్ 703 కోట్లతో మూడో స్థానం లో నిలిచాడు. కాగా ఇటీవల మెస్సీ తాను బార్సిలోనా జట్టను వదిలిపెడుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే బార్సిలోనా యాజమాన్యం మెస్సీకి ఝలక్ ఇచ్చింది. ‘మెస్సీ నిరభ్యంతరంగా జట్టును విడిపెట్టొచ్చు. కానీ అందు కోసం అతడు 700 మిలియన్ డాలర్లు ( మన కరెన్సీలో రూ.6వేల కోట్లు) చెల్లించాలని చెప్పింది. ఇదో అతడు జట్టులో చేరినప్పుడు చేసుకున్న నిబంధన’ అని బార్సిలోనా పేర్కొన్నది. దీంతో ఖంగుతున్న మెస్సీ తాను ఎక్కడికి వెళ్లడం లేదని.. బార్సిలోనా జట్టుతోనే ఉంటానని ప్రకటించాడు.