Begin typing your search above and press return to search.
దావూద్ ఇబ్రహీం రెడీ టు సరెండర్
By: Tupaki Desk | 4 July 2015 9:10 AM GMTప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ బాంబు పేల్చారు. అండర్ వరల్డ్ డాన్ తనతో మాట్లాడాడంటూ ఆయన తాజాగా వెల్లడించారు.. ఎటువంటి పేలుళ్లతోనూ సంబంధం లేదని దావూద్ తనతో చెప్పాడని రాంజెఠ్మలానీ అన్నారు. అంతేకాదు.... దావూద్ భారత్ లో లొంగిపోయేందుకు, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడని కూడా జెఠ్మలానీ చెప్పుకొచ్చారు.
ప్రాణభయంతోనే భారత్ కు వచ్చేందుకు జంకుతున్నాడని పేర్కొన్న రాంజెఠ్మాలానీ కేసు విచారణ జరుగుతున్నంత సేపు గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తే లొంగిపోయేందుకు దావూద్ సిద్ధంగా ఉన్నాడ రాంజెఠ్మలానీ చెప్పారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన ఈ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ను రప్పించడానికి భారత్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇది కీలక పరిణామమే.
మరి దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో... ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పాకిస్థాన్ దావూద్ ను భారత్ కు అప్పగించడం లేదంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు దావూదే ఇలా లొంగిపోతానంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఎంత వేగంగా స్పందిస్తుందో చూడాలి.