Begin typing your search above and press return to search.
దేశంలో తొలిసారి జరుగుతున్న 'మెటావర్స్' పెళ్లి?
By: Tupaki Desk | 19 Jan 2022 7:25 AM GMTరోటీన్ గా నడిస్తే స్పెషల్ ఏముంది? నలుగురు నడిచే దారికి భిన్నంగా నడిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం అలానే ఉంది దినేశ్.. జనగనందిని పెళ్లి. వారేమీ ప్రముఖులు కాదు.. సెలబ్రిటీలు కాదు.. ఆ మాటకు వస్తే కోట్లాదిగా ఉండే ఐటీ జంటలో వీరొకరు.కానీ.. వీరు చేసుకుంటున్న పెళ్లి.. ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. మాట్లాడుకునేలా చేస్తోంది.రానున్న రోజుల్లో ఇదే తరహాలో పెళ్లిళ్లుజరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. వచ్చే నెల ఆరున (ఫిబ్రవరి 6) జరగనున్న వీరి పెళ్లి ఇప్పుడు యూత్ ను తెగ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో దీని మీద చర్చ బాగా సాగుతోంది.
మెటావర్స్ విధానంలో దేశంలో జరుగుతున్న మొదటి పెళ్లి తమదేనని పెళ్లి కొడుకు దినేశ్ చెబుతున్నారు. ఈ తరహాలో పెళ్లికి పెళ్లి కుమార్తె కూడా ఓకే చెప్పిందట. ఇక.. వీరిద్దరి పెళ్లి మాత్రమే కాదు.. వీరి లవ్ స్టోరీ కూడా కాసింత స్పెషల్ గానే ఉంటుందని చెప్పాలి. ఇంతకీ ఈ మెటావర్స్ పెళ్లి అంటే ఏమిటి? ఈ జంట ఇలా ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది? ఇంతకీ దినేశ్.. జనగనందినిలు ఎవరు? అన్న విషయాల్లోకి వెళితే..
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా వార్తల్లో నిలవటమే కాదు.. నలుగురు మాట్లాడుకునేలా చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తమిళనాడుకు చెందిన దినేశ్ కూడా ఈ తరహాలోనే ఆలోచించాడు. తాను సౌండ్ అయిన టెక్నాలజీతో తన పెళ్లిని వెరైటీగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దినేశ్ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. ఐఐటీ మద్రాస్ లో ప్రాజెక్టు అసోసియేట్ గా పని చేస్తున్న అతనికి.. ఐటీ ఉద్యోగిని అయిన జనగనందిని ఆన్ లైన్ లో పరిచయమయ్యారు. వీరిద్దరి పరిచయానికి ఇన్ స్టా వేదికగా నిలిచింది. అది కాస్తా ప్రేమగా మారి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి ఓకే చెప్పించుకున్నారు. దినేశ్ ఎక్కువగా బ్లాక్ చెయిన్.. క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తిని చూపుతుంటాడు.
దీంతో.. తమ పెళ్లిని టెక్నాలజీ సాయంతో నిర్వహించే మెటావర్స్ లో చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కాబోయే భార్యను అడిగితే.. ఆమె కూడా ఓకే చేసింది. దీంతో.. దినేశ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మెటావర్స్ సాంకేతికతతో దేశంలో జరుగుతున్న మొదటి పెళ్లి తమదేనని పేర్కొన్నారు. ఇంతకీ ఈ మెటావర్స్ పెళ్లి ఏమిటన్న విషయంలోకి వెళితే.. వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా డిజిటల్ అవతార్ లతో ఉండటం. ఉదాహరణకు హ్యారీ పోర్టర్ ను తీసుకుంటే.. సినిమాల్లో పాత్రలు ఉంటాయి. కానీ.. వాటికి సంబంధించి కామెక్ రూపాలు ఉన్నట్లే.. అసలైన మనుషుల డిజిటల్ అవతార్ లను తయారు చేస్తారు. పెళ్లి వేడుకను ఆన్ లైన్ లో స్ట్రీమ్ చేస్తారు.
కరోనా నేపథ్యంలో వారున్న చోట ఉన్న ఆంక్షల నేపథ్యంలో తమ పెళ్లిని అందరికి పిలిచే పరిస్థితి ఉండదు. దీంతో పరిమిత కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకొని.. మెటావర్స్ విధానంలోనూ పెళ్లిచేసుకోనున్నారు. గంట పాటు వీరి పెళ్లి మెటావర్స్ లో జరగనుంది. దీనికి అవసరమైన సాంకేతిక సాయాన్ని ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ఇవ్వనుంది. ఈ పెళ్లిని అగ్మెంటెడ్ రియాల్టీ.. బ్లాక్ చెయిన్.. వర్చువల్ రియాలిటీల సాంకేతికత సమ్మేళనంగా చెప్పాలి. మరింత బాగా అర్థం కావాలంటే.. దినేశ్ పోస్టు చేసిన.. వీడియోను చూస్తే ఇట్టే అర్థమయ్యే అవకాశం ఉంది.