Begin typing your search above and press return to search.
రణతుంగపై ఎయిర్ హోస్టెస్ '#మీటూ' స్టోరీ!
By: Tupaki Desk | 10 Oct 2018 1:56 PM GMT`# మీ టూ` ఇపుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీరంగం నుంచి మొదలైన ఈ ఉద్యమం...రాజకీయాలు - క్రీడారంగంతో పాటు సమాజంలోని అన్ని రంగాలలోని చీకటి కోణాలను వెలుగులోకి తెస్తోంది. పెద్ద మనుషుల ముసుగు వేసుకొన్న చెడ్డ మనుషుల గుట్టు రట్టు చేస్తోంది. సినీ - జర్నలిజం - రాజకీయం - క్రీడా రంగాల్లో పలువరు పెద్ద మనుషులపై మహిళలు సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నానా పటేకర్ - వైరముత్తు - ఎంజే అక్బర్ వంటి ప్రముఖులపై కొందరు మహిళలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. క్రీడా రంగం కూడా వేధింపులకు అతీతం కాదని గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజాగా - శ్రీలంక మాజీ క్రికెటర్ - కెప్టెన్ అర్జున రణతుంగపై ఓ ఎయిర్ హోస్టెస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును వివరిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
ముంబై లోని హోటల్ జూహు సెంటర్ ఎలివేటర్ లో క్రికెటర్ల ఆటోగ్రాఫ్ కోసం వెళుతోన్న తన స్నేహితురాలి తోడుగా తాను కూడా వెళ్లానని ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పింది. తన మిత్రురాలు...వేరే వారిని కలవడానికి వెళ్లిందని - అపుడు తాను స్విమ్మింగ్‌పూల్ దగ్గర నిలబడి ఉన్నానని చెప్పింది. ఆ సమయంలో తనను చూసి పలకరింపుగా నవ్వాడని, తాను కూడా విష్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తనతో అసభ్యంగా ప్రవర్తించి, వికృత చేష్టలతో తనను చుట్టేశాడని చెప్పింది. అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నానని, అతడి పాస్ పోర్టు క్యాన్సిల్ చేయించి పోలీసులకు చెబుతాని బెదిరించానని చెప్పింది. అక్కడి నుంచి తప్పించుకొని హోటల్ రిసెప్షన్ లో కంప్లైంట్ చేసినా వారు తీసుకోలేదని తెలిపింది. #రణతుంగ పేరిట తన మీటూ స్టోరీని ఆ ఇండియన్ ఎయిర్ హోస్టెస్ వెల్లడించింది. 1996లో శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ రణతుంగ ప్రస్తుతం ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.