Begin typing your search above and press return to search.

సోషల్ పిచ్చ పీక్స్.. టవల్.. బనియన్ తో మెట్రో జర్నీ

By:  Tupaki Desk   |   11 Dec 2022 3:30 PM GMT
సోషల్ పిచ్చ పీక్స్.. టవల్.. బనియన్ తో మెట్రో జర్నీ
X
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక చాలామంది తాము చేసే పనులను తమ కోసం కాకుండా.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు తమ అతిని అందరి మీదా రుద్దుతున్నారు. తమ మాటలతో కొందరు.. చేతలతో మరికొందరు రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం కొన్నిసార్లు పాజిటివ్ గా మారితే.. మరికొన్నిసార్లు నెగిటివ్ గా మారి కేసుల వరకు వెళుతున్న పరిస్థితి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ మధ్యన హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఒక అమ్మాయి పాటకు స్టెప్పులు వేయటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే.దీంతో.. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ మెట్రో అధికారులు.. సదరు అమ్మాయిని గుర్తించి పిలిపించి వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ఇలాంటి ప్రదర్శనలకు మెట్రో స్టేషన్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఒక యువకుడు ఒంటికి టవల్.. బనియన్ వేసుకొని మెట్రో ఎక్కేశాడు. అతడ్ని చూసిన వారంతా షాక్ తిన్నారు. మరికొందరు ఇతగాడి తీరుకు పడి పడి నవ్వుకున్న పరిస్థితి. ఒంటి మీద టవల్.. బనియన్ ధరించి మెట్రో రైలు ఎక్కిన అతడు..

ఉన్న చోట ఉండకుండా కోచ్ ల చుట్టూ తిరగటం.. అద్దాల ముందు తనను తాను చూసుకోవటం.. జుట్టు దువ్వుకోవటం లాంటివి చేస్తూ అందరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒకరు పోస్టు చేయటంతో ఇతగాడి పిచ్చ బయటకు వచ్చింది.

ఇతగాడి తీరును కొందరు ఫన్నీగా తీసుకోగా.. మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఇతగాడి విచిత్ర వైఖరిని చూసి అమ్మాయిలు కొందరు పడి పడి నవ్వటం గమనార్హం. ఇదిలా ఉంటే.. అతగాడి టవల్ జారితే పరిస్థితి ఏంటి? అంటూ కొందరు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఇలాంటి తీరును ప్రదర్శించే వారిని రైలు ఎక్కే అవకాశం ఇవ్వకుండా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి తీరు పెరిగే కొద్దీ.. విచిత్ర రీతిలో రియాక్టు అయ్యే వారి సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.