Begin typing your search above and press return to search.
ఆగస్టు 15న హైదరాబాదీలకు భారీ ఊరట
By: Tupaki Desk | 20 July 2018 4:21 AM GMTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాదీల మరో నిరీక్షణ ఫలించే రోజు దగ్గరకు వచ్చేసింది. నగరంలోనే అత్యంత రద్దీ మార్గంగా.. పెద్ద ఎత్తున ప్రజలు రవాణా చేసే మియాపూర్ - ఎల్ బీ నగర్ మధ్య మెట్రో రైల్ పరుగులు తీసే రోజును డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.
మొదటి దశలో నాగోల్ - అమీర్ పేట.. మియాపూర్ - అమీర్ పేట మధ్యన మెట్రో రైలును నడుపుతున్నారు. అతి పెద్ద కారిడార్ గా చెప్పే మియాపూర్ - ఎల్ బీ నగర్ మార్గం మొదలు కాలేదు. కారణాలు ఏవైనా.. ఈ మార్గంలో ఎప్పుడో పరుగులు తీయాల్సిన మెట్రో అంతకంతకూ ఆలస్యమవుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ.. ఈ మధ్యన టెస్ట్ రన్ ను విజయవంతంగా పూర్తి చేయటంతో పాటు.. ట్రయల్ రన్ ను తరచూ నిర్వహిస్తున్నారు. ఈ రూట్ ను జులైన చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లుగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే.. ఇప్పటివరకూ సేఫ్టీ టెస్ట్ కాకపోవటం.. క్లియరెన్స్ రాలేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ముహుర్తాలకు ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గట్లే.. మంచి ముహుర్తం.. డేట్ ను చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అషాడమాసంలో కొత్త పనిని స్టార్ట్ చేయటం ఎందుకన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే టైంలో హైదరాబాద్ ప్రజల జీవితాల్లో మార్పుతెచ్చే ఈ ప్రాజెక్టు ప్రారంభం మంచి డేట్ వాల్యూతో ఉండాలన్నట్లుగా టీఆర్ ఎస్ సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా త్వరలో రానున్న ఆగస్టు 15న రెండో దశ మెట్రోను షురూ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఈ రూట్ కానీ అందుబాటులోకి వస్తే నిత్యం లక్షలాది మందికి సౌకర్యంగా ఉండటమే కాదు.. నగర ప్రజల సమయం భారీగా ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మియాపూర్ - ఎల్ బీనగర్ వరకూ నాన్ పీక్ సమయాల్లో గంటా నలభై నిమిషాలు.. పీక్ అవర్స్ లో రెండుబావు గంటల పాటు ప్రయాణం సాగుతోంది. కానీ.. మెట్రో మాత్రం 45 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుందని చెబుతున్నారు. భారీ ఎత్తున సమయం ఆదా కావటంతో పాటు.. చల్లటి ఏసీ గాలుల మధ్య ప్రయాణం అంటే ఎవరూ మాత్రం మెట్రో ఎక్కకుండా ఉంటారు..?