Begin typing your search above and press return to search.
ఫైజర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్: టీకా తీసుకున్న మహిళా డాక్టర్ కు మూర్చ!
By: Tupaki Desk | 3 Jan 2021 5:08 AM GMTఅమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కరోనా వ్యాక్సిన్ ను తయారుచేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఈ వ్యాక్సిన్ అత్యంత ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని ఆ దేశం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్ పనితీరుపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ మహిళ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న కొందరు డాక్టర్లకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. శరీరంపై దుద్దుర్లు - అలర్జీ లాంటి సమస్యలు వచ్చాయి.
అయితే వేల డోసుల వ్యాక్సినేషన్ జరగుతున్నప్పుడు ఇటువంటి ఘటనలు కామనేనని వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన ఓ వైద్యురాలు వ్యాక్సిన్ తీసుకున్న వెంబడే ఆమెకు మూర్చ వచ్చింది. మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల మహిళా డాక్టర్ ఫైజర్ బయోఎన్ టెక్ కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకున్నది. వ్యాక్సిన్ తీసుకున్న వెంబడే ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెలో మూర్ఛ - శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు రావడంతో న్యూవో లియోన్‌లోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ‘ఎన్సెఫలోమైలిటిస్’తో వైద్యురాలు బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్సెఫలోమైలిటిస్ అంటే మెదడు - వెన్నుపూస వాపుకు సంబంధించిన ఓ సమస్య. అయితే క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఇటువంటి సమస్య ఏదీ బయటపడలేదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఫైజర్ కంపెనీ స్పందించలేదు. మరోవైపు ఇప్పటికే మెక్సికోలో కరోనా మహమ్మారికి 1,26,500 మంది చనిపోయారు. ఫైజర్ వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతున్నప్పటికి.. అక్కడక్కడా ఇటువంటి సమస్యలు బయటపడుతున్నాయి. ఏ వ్యాధి సంబంధించిన వ్యాక్సిన్ తోనైనా.. అక్కడక్కడ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడుతుంటాయని.. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.