Begin typing your search above and press return to search.
ఎంజీ కొత్త కారు డిజైన్ లీక్.. ఫీచర్స్ తెలిస్తే పిచ్చిక్కిపోతుంది..!
By: Tupaki Desk | 30 March 2021 5:30 AM GMTబ్రిటన్కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ ఓ అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది. అయితే ఇందుకు సంబంధించిన ఫీచర్లు ముందే లీక్ అయ్యాయి. ఈ ఫీచర్లు చూసి కార్ల ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ఓ ఎలక్ట్రిక్ కార్ లో ఇంత అద్భుతమైనా ఫీచర్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఎంజీ తీసుకొచ్చిన ఈ కొత్త కారులో 5 జీ కనెక్టివిటీ అందుబాటులో ఉంచారు. అంతేకాక ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే .. దాదాపు 800 కిలోమీటర్ల ప్రయాణం చెయ్యొచ్చు. దీంతో కార్ల ప్రియులు ఫిదా అయిపోతున్నారు.
ఎంజీ కార్ల కంపెనీ తీసుకొచ్చిన కొత్త మోడల్ పేరు ఎంజి సైబర్స్టర్ అతి తర్వలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకా చకా జరిగిపోతున్నాయి.ఇదిలా ఉంటే .. ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. కంపెనీ ప్రతినిధులు కావాలనే లీక్ చేశారా?.. ఎవరైనా ఉద్యోగులు దీన్ని బయటకు తీసుకొచ్చారా? తెలియదు. కారు ప్రమోషన్ కోసం లీక్ అంటూ మార్కెట్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కొందరు అంటున్నారు.
ఆన్లైన్లో ఈ కారుకు సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ చిత్రాలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త కారును ఎంతో ఆకర్షణీయంగా తయారుచేశారు. అచ్చం స్పోర్ట్స్ కారును తలపించేలా రూపొందించారు. ముందుకు వంగి ఉన్న లిప్ స్పాయిలర్ల మధ్య ఎంజి లోగో ఇచ్చారు. సైబర్ స్టర్ లో మ్యాజిక్ ఐ ఇంటరాక్టివ్ హెడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. కారు వైపు లేజర్ బెల్ట్ ఎల్ఈడీ స్ట్రిప్ అమర్చారు.వాహనం వెనుక వైపు కాంబాక్ స్టైలింగ్ కూడా ఉంది. టైర్లు కూడా ఎంతో ధృడంగా ఉన్నాయి. సెంటర్ లాకింగ్ సిస్టమ్ తో ఈ కారును రూపొందించారు.
కాగా,ఈ కారు కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఇంటెలిజెంట్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా.. రూపొందించారు.వాహనంలో 5 జి కనెక్టివిటీ అందుబాటులో ఉంది.అయితే తొలిసారిగా గేమింగ్ కాక్ పింట్ ఈ కారు లోనే రూపొందించారు. ఈ కారును ముఖ్యంగా యువత ను దృష్టి లో ఉంచుకొని తీసుకొచ్చారు. కాగా దీని ధర ఎంత ? అన్న విషయం మాత్రం అందుబాటు లో లేదు. ప్రస్తుతం ఈ కారు కు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.