Begin typing your search above and press return to search.
అస్సాం ఎన్నికల బరిలో తెలుగుతేజం
By: Tupaki Desk | 4 Nov 2018 9:22 AM GMTచాలా తక్కువ మంది ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లో వస్తుంటారు. అలా వచ్చి సక్సెస్ అయిన తెలుగు అధికారుల పేర్లను లెక్కపెడితే ఒకే ఒక్కరి పేరు వినబడుతుంది. ఆయనే జయప్రకాష్ నారాయణ. ఆ తరువాత అస్సాం ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు ఎంజీవీకే భాను.
1985 బ్యాచ్ కు చెందిన ఎంజీవీకే భాను దేశంలో పేరొందిన అధికారుల్లో ఒకరిగా ఉన్నారు. 2011-16 లో అస్సాంలో ముఖ్యమంతిగా అధికారం చేపట్టిన తరుణ్ గొగోయ్ హయాంలో ఈయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మంచి పేరును సంపాదించుకున్నారు.
ఇటీవల పదవీ విరమణ చేసిన భాను తేజ్ పూర్ లో స్థిరపడ్డారు. అక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఈయన పొలిటికల్ ఎంట్రీ తీసుకోనున్నట్లు వార్తలు బయటకు రావడంతో, చేర్చుకునేందుకు పలు పార్టీల నేతలు ఆహ్వానాలు పలుకుతున్నారట. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అస్సాం గణపరిషత్(ఏజీపీ) లేదా బీజేపీ తరుపున తేజ్ పూర్ అసెంబ్లీ బరిలో దిగనున్నారు.