Begin typing your search above and press return to search.
ఆటో నడిపిన క్లార్క్ కు కేసుల లొల్లి..?
By: Tupaki Desk | 2 March 2017 2:24 PM GMTరోజులు గతంలో మాదిరి లేవు. ముచ్చట పడి సరదాగా చేసే పనులు ఒక్కోసారి లేని పోని చిక్కుల్ని తెచ్చి పెడుతుంటాయి. సెలబ్రిటీల సరదాల్ని ప్రజలు అస్వాదిస్తారు కానీ చట్టానికి అవన్నీ ఏమీ పట్టవు కదా. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్.. ప్రస్తుతం కామెంటేటర్ అయిన మైఖేల్ క్లార్క్ చేసిన సరదా పని.. వీడియోగా బయటకు రావటమే కాదు.. బోల్డంత పాపులార్టీని సంపాదించుకొని వైరల్ అవుతోంది.
భారత్.. ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు సిరీస్ కు వ్యాఖ్యాతగా క్లార్క్ వచ్చారు. ఒక ముందుగానే మ్యాచ్ ముగిసిపోవటం.. టీమిండియా ఘోర పరాజయం పాలు కావటం తెలిసిందే. అనుకోని రీతిలో ఒక రోజు సెలవు దొరికేసింది. దీంతో.. సరదాగా రోడ్డు మీదకు వచ్చిన క్లార్క్.. గార్డెన్ వీధుల్లో చాలా ఎక్కువగా కనిపించే ఆటోల్ని చూసి ముచ్చట పడిపోయాడు. దాన్ని నడపాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఒక ఆటో డ్రైవర్ ను.. ఆటో ఎలా నడుస్తుందో అడిగి తెలుసుకొని.. కొద్దిపాటి శిక్షనతో ఆటోను విజయవంతంగా నడిపేసి.. ముచ్చట తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు క్లార్క్. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆటో నడిపే విధానం నేర్చుకోవటం దగ్గర నుంచి రయ్యిన దూసుకెళ్లే వరకూ చూపించేశాడు.
ఆటోను.. ‘‘టక్ టక్’’ బండిగా అభివర్ణించిన క్లార్క్.. తానిప్పుడే టక్ టక్ బండిని నడపటం నేర్చుకున్నానని.. తాను టెస్ట్ క్రికెటర్ కెరీన్ ను ప్రారంభించిన బెంగళూరుకు మళ్లీ రావటం చాలా ఆనందంగా ఉందంటూ.. గార్డెన్ సిటీతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. దేశం కాని దేశంలో వాహనం నడిపే లైసెన్స్ క్లార్క్ దగ్గర ఉందా? తగిన పత్రాలులేకుండా ఆటోను రోడ్డు మీద నడిపిన దాని మీద ఎవరైనా ఉత్సాహవంతులు ఫిర్యాదు చేస్తే క్లార్క్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సాహసాలు రోడ్ల మీద చేసేటప్పుడు.. స్థానిక చట్టాల మీద అవగాహన లేకుండా చేస్తే.. లేనిపోని తిప్పలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/