Begin typing your search above and press return to search.

షేన్​వార్న్​ గురించి ఎవరికీ తెలియని టాప్​సీక్రెట్​ ఇదే.. చెప్పేసిన క్లార్క్​

By:  Tupaki Desk   |   26 May 2021 11:30 PM GMT
షేన్​వార్న్​ గురించి ఎవరికీ తెలియని టాప్​సీక్రెట్​ ఇదే..  చెప్పేసిన క్లార్క్​
X
షేన్​వార్న్​ క్రికెట్​ చరిత్రలో ఓ సంచలనం. అతడు ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్​ అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాను తన స్పిన్​ మాయాజాలంతో ఎన్నోసార్లు గట్టెక్కించాడు వార్న్​. అతడు బౌలింగ్​ చేస్తున్నాడంటే.. స్టార్​ బ్యాట్స్​మెన్లు సైతం హడలిపోయేవారు. ‘ఈ ఓవర్​ తొందరగా పూర్తయితే బాగుండు దేవుడా ’ అనుకొనేవారంట. తన బంతితో ఎన్నో విన్యాసాలు చేసి అగ్ర స్థాయి బౌలర్​ గా పేరుతెచ్చుకున్న షేన్​ వార్న్​ జీవితం వివాదాస్పదం కూడా అయ్యింది. అతడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో వార్న్.. 145 మ్యాచుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. డ్రగ్స్​ సహా పలు రకాల ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్​ చరిత్రలోనే కాక.. మొత్తం ప్రపంచ క్రికెట్​ చరిత్రలోనే షేర్​ వార్న్​ ఓ విభిన్నమైన, అద్భుతమైన బౌలర్​ అని చెప్పక తప్పదు.

నేటితరం స్పిన్నర్లు ఎంతో మంది షేన్​ వార్న్​ ను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మైఖెల్​ క్లార్క్​.. షేన్​వార్న్​ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు. జట్టును విజయతీరాలకు అందించిన షేన్​వార్న్​.. మీడియా తో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడని క్లార్క్​ చెప్పాడు. అతడు ఫామ్​ కోల్పోయిన ప్రతిసారీ మీడియా అతడిమీద వార్తలు రాసేదని క్లార్క్​ చెప్పుకొచ్చాడు. అంతేకాక.. షేన్​వార్న్​.. ఒత్తిడిని జయించేందుకు సిగరెట్లు తాగేవాడని.. బౌలింగ్​ చేసేకంటే ముందు అతడు స్మోకింగ్​ చేసేవాడని చెప్పాడు క్లార్క్​.

'వార్న్​ మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. అతడి వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్​ వచ్చాయి. మీడియా నుంచి అతడికి చాలా ఒత్తిడి ఉండేది. అనేక సందర్భాల్లో మీడియా అతడి మీద దుష్ప్రచారం చేసేది. ఈ తప్పుడు ప్రచారాన్ని తప్పించుకొనేందుకు వార్న్​.. సిగరెట్లు కాల్చేవాడు. తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసిన ప్రతిసారి తన బంతితోనే సమాధానం చెప్పేవాడు. అదే అతడి స్టయిల్​. అయినప్పటికీ అతడిపై తప్పుడు ప్రచారం తప్పలేదు.’ అంటూ షేన్​వార్న్​ పై పలు విషయాలను పంచుకున్నాడు క్లార్క్​.