Begin typing your search above and press return to search.
ట్రంప్ రాసలీలలు.. మరో సాక్ష్యం లీక్..
By: Tupaki Desk | 21 July 2018 10:45 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఆయన అధ్యక్షుడు కాకముందు సాగించిన రాసలీలల తాలూకా సాక్ష్యమొకటి తాజాగా బయటపడింది. దీంతో ట్రంప్ పై విమర్శల వాన కురుస్తోంది..
ఇటీవలనే అధ్యక్షుడు ట్రంప్ తో తనకు ఎఫైర్ ఉందని.. అతడితో రాసలీలలు నడిపానని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్(46) ఆరోపించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె బాంబు పేల్చింది. 2006లో ట్రంప్ తనతో ఎఫైర్ కొనసాగించాడని.. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండి బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ గ్యాప్ లో తనతో సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను నోరు విప్పకుండా ఉండేందుకు డబ్బు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని కరెన్ వివరించింది.
తాజాగా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంపై తన మాజీ అటార్నీ మైకేల్ కోహెన్ తో జరిపిన సంభాషణల ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్ కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ‘ఈ వ్యవహారం కొలిక్కి రావాలన్నా.. కరెన్ ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’ అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అయితే ఈ ఆడియో కోహెన్ వల్లే బయటకు రావడం విశేషం.
కోహెన్ పై ఇటీవలే అవినీతి, అక్రమాస్తుల కేసు నమోదైంది. పోలీసులు కోహెన్ కార్యాలయం నుంచి ఫోన్ స్వాధీనం చేసుకోగా అందులో ట్రంప్ తో మాట్లాడిన ఆడియో బయటపడింది. ఈ ఆడియో మీడియాలో దుమారం రేపడంతో ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికి.. కరెన్ తో ట్రంప్ కు ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ట్రంప్ కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావని స్పష్టం చేశారు.