Begin typing your search above and press return to search.
ఐపీఎల్ కోసమే భారత్ టెస్ట్ మ్యాచ్ రద్దు చేసుకుంది
By: Tupaki Desk | 11 Sep 2021 3:19 PM GMTఇంగ్లండ్ తో కీలకమైన ఐదో టెస్టును భారత్ రద్దు చేసుకోవడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. భారత కోచ్ రవిశాస్త్రి సహా సహాయక సిబ్బంది కరోనా బారినపడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదో ఆఖరి టెస్టును భారత్ రద్దు చేసుకుంది. అయితే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ చర్యను తప్పు పడుతున్నారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి ఐపీఎల్ ను టార్గెట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ రద్దైన నేపథ్యంలో 'ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను తరలిస్తాయి. యూఏఈలో 6రోజుల క్వారంటైన్ టోర్నీ ప్రారంభం కావడానికి 7 రోజుల టైం ఉందని మైకేల్ వాన్ అనుమానం వ్యక్తం చేశాడు.
దీన్ని బట్టి ఐపీఎల్ కోసమే టెస్ట్ మ్యాచ్ రద్దు చేసుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోందని మైకేల్ వాన్ ఆరోపించాడు. ఈ మేరకు ట్వీట్ చేసి భారత జట్టు తీరును ఎండగట్టారు.
కోవిడ్ భయాలు మధ్య ఎలా ఆడుతారని.. భారత జట్టులోని సభ్యులకు, కోచ్ లకు కరోనా సోకితే ఎలా భారత ఆటగాళ్లు కానసన్ ట్రేట్ చేస్తారని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఐపీఎల్ పై నోరుజారిన మైకేల్ వాన్ పై భారత అభిమానులు మండిపడుతూ అతడి ట్వీట్ కు కౌంటర్లు ఇస్తున్నారు.