Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు మెంట‌లా?..సంచ‌ల‌నంగా మారిన బుక్‌

By:  Tupaki Desk   |   6 Jan 2018 4:40 AM GMT
ట్రంప్‌ కు మెంట‌లా?..సంచ‌ల‌నంగా మారిన బుక్‌
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ పై అమెరికాలో తాజాగా రిలీజ్ అయిన బుక్ పెను దుమారాన్ని రేపుతోంది. ట్రంప్ ఆరోగ్య ప‌రిస్థితిపై స‌రికొత్త ఆందోళ‌న‌లు రేపేలా ఈ పుస్త‌కం ఉండ‌టం గ‌మ‌నార్హం. అధ్య‌క్ష ప‌ద‌వికి ఏ మాత్రం స‌రిపోని వ్య‌క్తిగా ఈ పుస్త‌కంలో పేర్కొన్నారు.

ట్రంప్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించి.. సేక‌రించిన పుస్త‌కంగా దీన్ని పేర్కొంటున్నారు. ట్రంప్ మెంట‌లోడ‌న్న‌ట్లుగా ఈ పుస్త‌కం అమెరికాలో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ పుస్త‌కాన్ని రాసిన ర‌చ‌యిత మైఖేల్ వోల్ప్ ఈ పుస్త‌కంలో తాను రాసిన ప్ర‌తి విష‌యానికి తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇంత‌కీ ట్రంప్ వ్య‌క్తిగ‌త విష‌యాలు.. వైట్ హౌస్ లో ఆయ‌న రాసిన వివ‌రాలు ఆయ‌న‌కు ఎలా వ‌చ్చాయ‌న్న దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. ట్రంప్ న‌కు వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన స్టీవ్ బాన‌న్ స‌హ‌కారంతో స‌ద‌రు పుస్త‌క ర‌చ‌యిత‌.. వైట్ హౌస్ లో ఏం జ‌రిగింద‌న్న అంశంపై దృష్టి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. బాన‌న్ ను కొద్ది నెల‌ల కింద‌టే ట్రంప్ డిస్మిస్ చేశారు. తాను రాసిన ప్ర‌తి అంశం నిజ‌మ‌ని.. తాను వాటికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని పుస్త‌క ర‌చ‌యిత పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. పుస్త‌క ర‌చ‌యిత మైఖేల్ వోల్ప్ కు ట్రంప్ ఎప్పుడు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న త‌ర‌పు వారు కొట్టిపారేస్తున్నారు.వూల్ప్ ఇప్ప‌టికి 30 సార్లు ఇంట‌ర్వ్యూ కోసం రిక్వెస్ట్ పంపినా.. ట్రంప్ మాత్రం ఓకే చేయ‌లేదంటున్నారు. ఇంత‌కీ పెను సంచ‌ల‌నంగా మారిన ఈ పుస్త‌కంలో ఏముంది? ఏం రాశారు? ఇప్పుడు వైట్ హౌస్ లోప‌ల ఏం జ‌రుగుతోంది? ట‌్రంప్ త‌న స‌తీమ‌ణితో ఎలా ఉన్నారు? ఆయ‌న కుమార్తె ఇవాంక ఎలాంటిది లాంటి ఎన్నో ఆస‌క్త‌క‌ర‌.. వివాదాస్ప‌ద అంశాలు పుస్త‌కంలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

= ట్రంప్ కు అత్యంత స‌న్నిహితులు చెబుతున్న దాని ప్ర‌కారం.. ఆయ‌న‌ది పూర్తిగా చిన్న పిల్లాడి మ‌న‌స్తత్వం. పిల్ల‌లు ఎలా అయితే ఒకే విష‌యం మీద దృష్టి సారించ‌రో.. ట్రంప్ కూడా అదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

= అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు. ఏ విష‌యంపైనా.. విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం మీదా ఆయ‌న ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు కూడా దృష్టి నిలుప‌లేక‌పోతున్నారు. గ‌తంలో ఒకే విష‌యాన్ని అర‌గంట‌లో ప‌దిసార్లు చెప్పేవారు. ఇప్పుడు ప‌ది నిమిషాల్లో ప‌దిసార్లు చెబుతున్నారు.

= కీల‌క వ్య‌క్తుల్ని కూడా గుర్తు పట్ట‌టం లేదు. ఫాక్స్ న్యూస్ చీఫ్ రోజ‌ర్.. ప్ర‌తినిధుల స‌భ మాజీ స్పీక‌ర్ జాన్ బొయిన‌ర్ ల‌ను ట్రంప్ గుర్తించ‌లేక‌పోతున్నారు. రాజ్యాంగంలోని కీల‌క అంశాల్ని విడ‌మ‌ర్చి చెప్పినా ఆయ‌న అర్థం చేసుకోలేదు మొద‌టి డిబేట్ కు ముందు ఎనిమిది రోజుల పాటు ఆయ‌న‌కు శామ్ న‌న్ బెర్గ్ అనే నిపుణుడి చేత అన్ని విష‌యాలు చెప్పించారు.

= అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే రోజు త‌న స‌తీమ‌ణి మెలినియాతో ట్రంప్ తీవ్రంగా గొడ‌వ‌ప‌డ్డారు. ఆమె క‌ళ్ల‌నీళ్ల ప‌ర్యంతం అయ్యేట‌ట్లు వ్య‌వ‌హ‌రించారు.

= ట్రంప్ కుమార్తె ఇవాంకా త‌న తండ్రి జుట్టురంగును వెక్కిరించేది. ఆ జుట్టులో త‌న తండ్రి బ‌ఫూన్ లా ఉన్నార‌నేది. అమెరికాకు తాను తొలి మ‌హిళా అధ్య‌క్షురాలు కావాల‌న్న‌దే ఆమె ఆశ‌. ఆమె చాలా అత్యాశ ఉన్న మ‌హిళ‌.

= స్నేహితుడి పెళ్లాన్ని ప‌క్క‌లో పిలిపించుకోవ‌టమ‌న్న‌ది గొప్ప అనుభూతిగా ట్రంప్ చెప్పేవారు. అలా చేస్తే జీవితం సార్థ‌క‌త‌మ‌వుతుంద‌నేవాడు. ఒక స్నేహితుడి భార్య‌ను అలానే ర‌ప్పించాల‌ని చూశాడుకూడా. నువ్వు కోరుకున్న సౌఖ్యం నీ మొగుడి ద‌గ్గ‌ర లేద‌ని ఆమెను కెలికాడు.

= 2016 జూన్ లో ర‌ష్యా లాయ‌ర్ తో జూనియ‌ర్ ట్రంప్ మీటింగ్ దేశ ద్రోహంగా భావించాలంటూ ట్రంప్ కు వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన స్టీవ్ బాన‌న్ పేర్కొన్నారు. ఆ తరువాత జేర్డ్‌ కుష్నర్‌ - పాల్‌ మనఫోర్ట్‌ లాంటి ప్రచార విభాగ అధికారులు కూడా రష్యన్లతో సమావేశమయ్యారు. చివరకు ట్రంప్‌ కూడా రష్యా అధికారులను - రష్యా న్యాయవాదిని కలిశారు. ఆఖరికి ట్రంప్‌ ప్రైవేట్‌ లీగల్‌ టీమ్‌ ప్రతినిధి మార్క్‌ కొరాలో కూడా న్యాయపరమైన దర్యాప్తు జరక్కుండా ట్రంప్‌ అడ్డుపడుతున్నారన్నారు.

= మీడియా కింగ్‌ రూపర్ట్‌ మర్డాక్‌ తో ట్రంప్‌ నిత్యం ఫోన్లో చాలాసేపు మాట్లాడతారు. దాదాపు ఆయన అమెరికా అధ్యక్ష వ్యవహారాల్లో ఓ భాగమైపోయారు.