Begin typing your search above and press return to search.
అధ్యక్షుడి సతీమణి ‘‘తోక లేని కోతి’’
By: Tupaki Desk | 16 Nov 2016 4:10 AM GMTఈ అమెరికన్లకు ఏమైందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసహనమో.. జాత్యాంహకారమో.. తెంపరితనమో.. బరితెగింపో అర్థం కాకున్నా.. వారి చేస్తున్న చేష్టలు.. అంటున్న మాటలు షాకింగ్ గా మారుతున్నాయి. ప్రాశ్చాత్య దేశంలోని నాగరికులుగా అనుకునే అమెరికన్లలో అనాగరికుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందన్న భావన ఈ మధ్య చోటు చేసుకుంటున్న ఉదంతాల్ని చూస్తుంటే కలగక మానదు.
అమెరికా అధ్యక్షుడిగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మీద వ్యతిరేకతతో.. ఆయన సతీమణి.. కాబోయే అమెరికా ప్రధమ మహిళను ఉద్దేశించి.. ‘‘రేప్ చేస్తామంటూ’’ ట్విట్టర్ లో హ్యాగ్ ట్యాగ్ పెట్టుకునే నీచానికి ఒడికట్టిన వైనం అందరిని విస్మయానికి గురి చేసింది. అధ్యక్షుని సతీమణిని ఎలా రేప్ చేయాలి? ఎక్కడ రేప్ చేయాలి? లాంటి విషయాల్ని ఓపెన్ గా చర్చించే స్థాయికి దిగజారి.. తామెంత అనాగరికులమన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పేసే ప్రయత్నం చేశారు.
ఈ షాక్ మర్చిపోకముందే తాజాగా ఇలాంటిదే మరొక ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే.. ఈసారి బాధితురాలు ప్రస్తుత అధ్యక్షుని సతీమణి మిషెల్లీ కావటం గమనార్హం. ఆమెను అగౌరవపరిచేలా.. అవమానించేలా ఒక స్వచ్ఛందం సంస్థ నడుపుతున్న మహిళ ఒకరు చేయగా.. దానికి ఒక స్థానిక నేత వంత పాడటం దుమారంగా మారింది.
వైట్ హౌస్ లో ఇంతకాలం హీల్స్ వేసుకున్న తోక లేని కోతిని చూసి విసిగిపోయానని.. అక్కడికి అందం.. హుందాతనంతో ఉన్న ఉన్నత ప్రథమ మహిళ రాబోతుందని పమేలా రామ్సే టేలర్ అనే మహిళ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యల్ని చూసిన క్లే అనే చిన్న పట్టణానికి చెందిన మేయర్ బెవర్లీ వేలింగ్ ఈ రోజు ధన్యమైందంటూ సమర్థిస్తూ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది.ఈ ఇద్దరు మహిళల్ని వారి పదవుల నుంచి తొలగించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలు అయి ఉండి సాటి మహిళపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయటం చూస్తే.. అమెరికా ఎంతమాత్రం నాగరిక సమాజం కానేకాదని.. తెల్లతోలు కప్పుకున్న తోడేళ్ల గుంపుగా ఎవరో ఒకరు అభివర్ణించినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/