Begin typing your search above and press return to search.

అలా చేస్తే మిషెల్లీ విడాకులు ఇస్తుందట!

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:45 AM GMT
అలా చేస్తే మిషెల్లీ విడాకులు ఇస్తుందట!
X
నిజం చెప్పాలంటే అమెరికా రాజ్యాంగ నిబంధనలు బరాక్ ఒబామా వైవాహిక బంధాన్ని కాపాడాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్ధులిద్దరికంటే ఒబామా కచ్చితంగా బలమైన నేతే!! ఈ క్రమంలో మూడో సారి కూడా బరిలో నిలబడే అవకాశం ఉంటే కనుక, ఈ ఎన్నికల్లో కూడా అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా నిలబడితే కనుక ఆయన ఇంట్లో పెద్ద గొడవే ప్రారంభమైపోయి ఉండేదట! అవును ఆ గొడవ ఎంత పెద్దదంటే... ఆ విషయాలు ఒబామానే చెబుతున్నారు!!

తన భార్య మిషెల్లీ కి అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని.. ఒక వేళ తనకు మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటే మిషెల్లీ ఏకంగా విడాకులు ఇస్తుందని సరదాగా చెబుతున్నారు ఒబామా. ఒక లైవ్ షోలో పాల్గొన్న ఒబామా ఈ సందర్భంగా పైవిదంగా చమత్కరించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ల తరుపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రతిసారి తనను ట్వీట్ ద్వారా విమర్షించడంపై కాస్త భిన్నంగా స్పందించారు. "ఒబామా త్వరలోనే దిగిపోతున్నారు... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఎన్నికైన అధ్యక్షుల్లోనే ఆయన ఒక చెత్త అధ్యక్షుడు" అని ట్రంప్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒబామా... కనీసం తాను అధ్యక్షుడిగానైనా దిగిపోతున్నానని అన్నారు. అంటే... ట్రంప్ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ లేదని చెప్పడం ఒబామా ఉద్దేశ్యమో ఏమో!

ఇక ట్రంప్ ను టీవీలో చూస్తున్నప్పుడు మీరెప్పుడైనా నవ్వారా అన్న మరో ప్రశ్నపై స్పందించిన ఒబామా... "అబ్బో... చాలాసార్లు నవ్వాను" అని అన్నారు. 2011లో జపాన్ ను సునామీ చుట్టుముట్టినప్పుడు తాను నిద్రలో నుంచి మేల్కోని అర్థరాత్రి మూడు నాలుగుసార్లు బెడ్ పై ఉండే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయని తన అయితే, తాను ఎప్పుడూ కూడా తెల్లవారు జామున తన స్మార్ట్ ఫోన్ వద్దకు వెళ్లేవాడిని కాదని, తనను విమర్శించేవారిపై ఉదయం మూడు గంటలకే ట్వీట్ ల ద్వారా ఆరోపించే అలవాటు తనకు లేదని ట్రంప్ పై విరుచుకుపడ్డారు.

కాగా, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ లెక్కప్రకారం ఒబామా వచ్చే ఏడాది జనవరి 20 వరకూ పదవిలో కొనసాగుతారు. తర్వాత హిల్లరీ క్లింటన్ లేదా డొనాల్డ్ ట్రంప్ అధినేతగా పగ్గాలు స్వీకరిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/