Begin typing your search above and press return to search.

అనుకోని తప్పిదం వల్లే .. షా ప్రొఫైల్ పిక్ తొలగింపు : ట్విట్టర్

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:10 PM GMT
అనుకోని తప్పిదం వల్లే .. షా ప్రొఫైల్ పిక్ తొలగింపు : ట్విట్టర్
X
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో కేంద్ర మంత్రి అమిత్ షా ఖాతాలో కొద్దిసేపు ఆయన ప్రొఫైల్ ఫోటో మాయమైంది. ఓ కాపీరైట్ హోల్డర్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఆ ఫోటోను తొలగించినట్టు ట్విటర్ పేర్కొంది. ఆయనకు చెందిన వెరిఫైడ్ ఖాతాలో డిస్‌ప్లై పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఓ తెల్ల పేజీలో చిన్న సందేశం కనిపించింది. మీడియా కనిపించదు. ఓ కాపీరైట్ హక్కుదారుడి నుంచి అందిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా ఈ ఇమేజ్‌ను తొలగించడం జరిగింది..అంటూ ఓ సందేశం కనిపించింది. అయితే కొద్ది సేపటికే మళ్లీ అమిత్ షా ప్రొఫైల్‌ ఫోటోను పునరుద్ధరించారు. సాధారణంగా, ఎలాంటి ఫోటో అయినా సరే.. ఆ ఫోటోలో ఏముందన్నది కాదు. సదరు ఫోటోను తీసిన ఫోటోగ్రాఫరే దాని అసలు హక్కుదారుడు అని ట్విటర్ కాపీ రైట్ పాలసీ చెబుతోంది.

అమిత్ ప్రొఫైల్ ఫోటోను తొలగించడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ క్షమాపణలు చెప్పింది. కాపీరైట్ పాలసీ నిబంధనల కారణంగా అనుకోని తప్పిదం వల్లే తాత్కాలికంగా అమిత్ షా ప్రొఫైల్‌ ను లాక్ చేసినట్టు పేర్కొంది. ఈ ఘటనపై ట్విటర్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడంతో ఇవాళ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ... ‘అనుకోని ఓ తప్పిదం కారణంగా అంతర్జాతీయ కాపీరైట్ విధానాల కింద కొద్దిసేపు ఈ ఖాతాను లాక్ చేశాం. అయితే వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. ఈ ఖాతా ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది.. అని అన్నారు.