Begin typing your search above and press return to search.
స్కైప్ వాడాలంటే ఆధార్ కావాలి
By: Tupaki Desk | 23 Feb 2017 4:53 AM GMTసర్వం ఆధార్ మయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇపుడు స్కైప్ ను ఉపయోగించాలనుకున్నా ఆధార్ తప్పనిసరి అయింది. భారత స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ స్కైప్ లో లైట్ వెర్షన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ డీకోడెడ్ కాన్ఫరెన్స్‌లో సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఈ యాప్ ను విడుదల చేశారు. కేవలం 13 ఎంబీ సైజులో వచ్చే స్కైప్ లైట్ యాప్...తక్కువ సామర్థ్యం గల స్మార్ట్ ఫోన్ లతో పాటు డాటా వేగం 2జీ - 3జీ స్థాయికి పడిపోయినప్పుడు సైతం మెరుగ్గా పనిచేయగలిగేలా డిజైన్ చేశారు.హైదరాబాద్ లోని సంస్థ ఆర్ అండ్ డీ సెంటర్ లో అభివృద్ధి చేసిన ఈయాప్ ను ప్రత్యేకంగా దేశీయ కస్టమర్ల కోసమే రూపొందించారు. తెలుగుతోపాటు హిందీ - గుజరాతీ - బెంగాలీ - మరాఠీ - తమిళం - ఉర్దూ (మొత్తం 7) భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ఆధార్‌తో అనుసంధానితం ఈ యాప్ ప్రత్యేకత. పరిచయం లేని యూజర్ల వివరాలను ధ్రువీకరించుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఉద్యోగులను ఆఫ్ లైన్ లో ఇంటర్వ్యూ చేసేందుకు, తెలియని వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు కంపెనీ యాజమాన్యాలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని సంస్థ అంటోంది. స్కైప్ యాప్‌లోనూ ఇన్ బిల్ట్ ఆధార్ ఇంటిగ్రేషన్ ఫీచర్ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. స్కైప్ తోపాటు సంస్థకు చెందిన లింక్డ్ ఇన్ సైట్ లోనూ లైట్ వెర్షన్ ను లాంచ్ చేసింది సంస్థ. ప్రాజెక్ట్ సంగం పేరుతో ప్రకటించిన కార్యక్రమం ద్వారా భారతీయ విద్యార్థులు మార్కెట్లో ఉద్యోగావకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఓ వేదికను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాట్ ఫాం ద్వారా నిపుణులు తమ వద్దనున్న సమచారాన్ని ఔత్సాహికులతో పంచుకునేందుకు వీలుకల్పించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/