Begin typing your search above and press return to search.
సత్యనాదెళ్ల ఇంత రహస్య పర్యటన ఏంటో?
By: Tupaki Desk | 7 Nov 2017 5:49 AM GMTమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల...భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సత్య నాదెళ్ల హైదరాబాద్ రావడం వెళ్లిపోవడం కూడా జరిగిపోవడం..ఇదంతా మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా పూర్తయిపోవడం ఆసక్తికరంగా మారింది. సోమవారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా నగరంలోని మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించిన నాదెళ్ల.. అక్కడి ఉద్యోగులతో మాటామంతి జరిపారు. డెవలప్ మెంట్ సెంటర్ కు విచ్చేసిన సందర్భంగా ఉద్యోగులతో చర్చించడంతోపాటు తన పుస్తకం హిట్ రిఫ్రెష్ గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా సంస్థలో చేరినప్పటి నుంచి సీఈవోగా ఎదిగేంతవరకు తన జీవితంలోని విషయాలను సిబ్బందితో పంచుకున్నారు అని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఆదివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న నాదెళ్ల.. ఉదయం ఇక్కడి ఉద్యోగులతో సంభాషించిన తర్వాత మధ్యాహ్నానికి ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ జరుగనున్న ఇండియాటుడే కాంక్లేవ్ నెక్స్ 2017 నాదెళ్ల కీలకోపన్యాసం చేయనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన నాదెళ్ల.. ఉద్యోగులు - కస్టమర్లు - ఇండస్ట్రీ ప్రతినిధులు - కేంద్ర ప్రభుత్వ నాయకులతో భేటీ కానున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ పర్యటన సందర్భంగా నాదెళ్ల తాను రాసిన పుస్తకం హిట్ రిఫ్రెష్ తెలుగు - హిందీ తమిళ ఎడిషన్లను విడుదల చేయనున్నారు.
అయితే ఈ తెలుగు పుస్తకం హైదరాబాద్ లో విడుదల అవుతుందని పలువు భావించారు. కానీ అందుకు భిన్నంగా సత్య....లో ప్రొఫైల్ తో తన టూర్ ను ముగించడం ఆసక్తికరంగా మారింది.