Begin typing your search above and press return to search.
మైక్రోసాఫ్ట్ అరుదైన రికార్డు.. చతికిలపడిన యాపిల్..!
By: Tupaki Desk | 29 Oct 2021 3:30 AM GMTమైక్రోసాఫ్ట్.. ఇది పరిచయం లేని పేరు. పెరిగిన సాంకేతికతో పాఠశాల విద్యార్థికి సైతం మైక్రోసాఫ్ట్ అంటే ఏమిటో తెలుసు. అయితే ఈ ఐటీ దిగ్గజం త్వరలో అరుదైన రికార్డును సాధించనుంది. కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ల సంస్థ అయిన యాపిల్ మీద గతకొంత కాలంగా కన్నేసిన మైక్రోసాఫ్ట్... త్వరలో దానిని అధిగమించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్ భారీ లాభాలను ఆర్జించింది. ఈ లాభాలతో త్వరలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుందని నిపుణులు అంటున్నారు. అయితే యాపిల్ మాత్రం కాస్త చతికిలపడిపోయింది. వెనుకబడిన యాపిల్ కంపెనీ స్థానానికి మైక్రోసాఫ్ట్ చేరుకోనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్ భారీ లాభాలను పొందడమే దీనికి కారణం. తాజా ఫలితాల ప్రకారం మైక్రోసాఫ్ట్ క్యాప్ విలువ యాపిల్ కు దాదాపు చేరువగా ఉంది. రిఫినిటివ్ డేటా ప్రకారం మైక్రోసాఫ్ట్ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీని షేర్లు 4.2 శాతం పెరిగి 323.17 డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ తో భారీ త్రైమాసిక వృద్ధి సాధ్యమైందని నిపుణులు అంటున్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్కసారిగా 2.426 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. అంతాకలిపి ఏకంగా 45 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆధారిత సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో లాభాలను గడించిన మైక్రోసాఫ్ట్ ను సప్లై చైన్ కాస్త కలవరపెడుతోంది. ఇప్పటిదాకా మంచి లాభాలతో ఉన్న దీనికి సరఫరా గొలుసు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ లు, ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ లు ఉత్పత్తి యూనిట్లకు సప్లై చైన్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించినట్లుగా సమాచారం.
కరోనా కాలంలో మైక్రోసాప్ఠ్ అరుదైన రికార్డు సాధించింది. ఈ సంక్షోభ పరిస్థితులు మైక్రోసాఫ్ట్ కు ఒకింత లాభాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఎంతోకాలంగా యాపిల్ పై కన్నేసిన మైక్రోసాఫ్ట్... త్వరలో ఆ మైలురాయిని సాధించనుంది. ఇక యాపిల్ కాస్త చతికిల పడడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్ త్రైమాసిక ఫలితాలను యాపిల్ మంగళవారం విడుదల చేసింది. కాగా వెంటనే యాపిల్ షేర్లు గణనీయంగా తగ్గడం గమనార్హం. ఒక్కసారిగా 0.3శాతం క్షీణించినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సప్లై చైన్ సంక్షోభ ప్రభావం యాపిల్ ఫోన్లపై తీవ్రంగా పడినట్లు నిపుణులు చెబుతున్నారు. యాపిల్ కు చిప్స్ కొరత ఉన్నాయి. అందుకే కాస్త వెనుకబడిందని అంటున్నారు. 2021లో యాపిల్ షేర్లు 12 శాతం పెరిగాయి. యాపిల్ స్టాక్స్ విలువ పెరిగి... 2010లో మైక్రోసాప్ఠ్ ను అధిగమించింది. కాగా ఇటీవల మైక్రోసాఫ్ట్ ఈ రికార్డును బ్రేక్ చేయనుంది. అతి త్వరలో ప్రముఖ కంపెనీ యాపిల్ ను మైక్రోసాఫ్ట్ ను అధిగమించబోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.