Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగుల ఏరివేత మొద‌లైంది

By:  Tupaki Desk   |   7 July 2017 7:33 AM GMT
మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగుల ఏరివేత మొద‌లైంది
X
అంత‌ర్జాతీయ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కంపెనీ రీ ఆర్గ‌నైజేష‌న్‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా సుమారు 3 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేకించి సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల తొల‌గింపు ఎక్కువ‌గా ఉండ‌నుంది. క‌స్ట‌మ‌ర్లు - పార్ట్‌ న‌ర్ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డం కోస‌మే కంపెనీలో ఈ మార్పులు చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఈ ప‌రిణామం టెక్ నిపుణుల్లో క‌ల‌వ‌రానికి దారితీస్తోంది.

తాజా నిర్ణ‌యంపై మైక్రోసాఫ్ట్ ప్ర‌తినిధి స్పందిస్తూ ``అన్ని సంస్థ‌ల్లో జ‌రిగిన‌ట్లే ప్ర‌తి ఏడాది మా సంస్థ‌లోనూ మ‌దింపు ఉంటుంది. అందులో భాగంగా కొన్ని శాఖ‌ల్లో ఎక్కువ పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. మ‌రికొన్నింట్లో భారం త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో తీసుకున్న‌దే తాజా నిర్ణ‌యం`` అని సంస్థ అధికార ప్ర‌తినిధి చెప్పారు. కంపెనీలో ఉన్న మొత్తం సేల్స్ ఉద్యోగుల్లో ప‌ది శాతం వ‌ర‌కు ఉద్యోగాలు కోల్పోనున్నారు. అందులోనూ వీళ్ల‌లో 75 శాతం అమెరికా బ‌య‌ట ఉన్నావాళ్లే. మైక్రోసాఫ్ట్ త‌మ క్లౌడ్ స‌ర్వీసెస్ ప్రొడ‌క్ట్ అయిన అజ్యూర్‌ను ఎలా ప్ర‌మోట్ చేయాల‌న్న‌దానిపైనే దృష్టి సారిస్తోంది. ఇందులో అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్‌ కు గట్టి పోటీ ఉంది. అయితే చివ‌రి త్రైమాసికంలో అంత‌కుముందుతో పోలిస్తే అజ్యూర్ 93 శాతం వృద్ధి సాధించింది. మైక్రోసాఫ్ట్ అమెరికాలో 71 వేల మంది, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 21 వేల మంది ప‌ని చేస్తున్నారు.