Begin typing your search above and press return to search.
బాబూ.. బీసీ విద్యార్థులకు నీళ్ల సాంబారేనా
By: Tupaki Desk | 31 Oct 2017 10:43 AM GMTఏపీ సీఎం చంద్రబాబును షాక్ కు గురిచేసే వార్త ఇది. ఆయన సొంత జిల్లా చిత్తూరులో జరిగిన ఓ నిర్వాకం.. బాబు పరువుతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట కూడా దిగజారిపోయింది. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలి. వారికి అన్ని విధాలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని - హస్టళ్లను కట్టిస్తుందని - మంచి చదువు చెబుతుందని నిన్నటికి నిన్న సచివాలయం వేదికగా చంద్రబాబు చెప్పిన మాటలు తెల్లారేసరికి నీళ్ల సాంబార్ అయ్యాయి!! భావి భారత పౌరులుగా చంద్రబాబు చెబుతున్న విద్యార్థులకు ఆయన సొంత ఇలాకాలోనే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అటు తల్లిదండ్రులు - ఇటు విద్యార్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ప్రభుత్వం భారీ ఖర్చుతో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేసింది. దీనిలో 133 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 70 మంది ఇంటర్ - 41 మంది డిగ్రీ - 22 పీజీ కోర్సులు చదువుతున్నారు. వీరికి ఇక్కడే బస - భోజన ఏర్పాట్లు చేశారు. ఇంత వరకు బాగానేఉన్నా.. వారికి పెడుతున్న తిండి - రూంలో మౌలిక సదుపాయాలు - హాస్టల్ చుట్టూ ఉన్న వాతావరణం వంటివి విద్యార్థినులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఏ విద్యార్థి చదివేందుకైనా మంచి ఆహారం అవసరం. అయితే, ఇక్కడ విద్యార్థినులకు అందిస్తున్న భోజనం దారుణంగా ఉంటోందని వారు తీవ్ర ఆందోళనకు దిగారు.
ఈ బీసీ హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని - గడ్డ కట్టిన ముద్ద అన్నం - వేడినీళ్ల సాంబారుతో భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చెప్పినా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తొట్టంబేడు మండలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ సైతం విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నం కుక్కలు కూడా తనవని ఆయన వ్యాఖ్యానించారు. ఆహారం ఈ స్థాయిలో ఉంటే విద్యార్థులు ఎలా చదవ గలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఇక, హాస్టల్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో రోగాల బారిన పడుతామని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి బాబు ఇలాకాలోనే బీసీ విద్యార్థులకు ఇంత సత్కారం జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.