Begin typing your search above and press return to search.
బీజేపీ-శివసేన కటీఫ్ తప్పదా?
By: Tupaki Desk | 25 March 2017 7:37 AM GMTహిందూత్వ అనే ఏక సూత్రంపై ఆధారపడి దశాబ్దాలుగా కాపురం చేస్తున్న బీజేపీ, శివసేనల మధ్య కటీఫ్ తప్పదా? శివసేనను వదిలించుకోవడానికి బీజేపీ పెద్దపెద్ద అడుగులు వేస్తోందా... యూపీలో విజయం తీసుకొచ్చిన ఊపుతో మహారాష్ర్టలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి శివసేన అవసరం లేకుండా సొంతంగా గెలిచి శివసేనను జీరో చేయడానికి మోడీ పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
మిత్ర పక్షాల భాగస్వామ్యం ఉన్నా కూడా వారి సహకారం ఎంతమాత్రమూ లేకుండానే మోడీ కేంద్రంలో హోల్ అండ్ సోల్ గా పాలన సాగిస్తున్నారు. మోడీ అవసరం ఉందన్న పరిస్థితి మిగతా మిత్ర పక్షాలకు కల్పించి వారే తమతో కొనసాగేలా చేసుకున్నారు ఆయన. దీంతో మిత్రులెవ్వరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా పాలన సాగిస్తున్నారాయన. మిగతా పార్టీలు మౌనంగా దీన్ని భరిస్తున్నా శివసేన మాత్రం సహించలేకపోతోంది. అడపాదడపా తన నిరసన వ్యక్తంచేస్తూనే ఉంది. ఆ కారణంగానే మహారాష్ర్టలో ఫడ్నవీస్ తో కీచులాటలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు భాజపా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలలో భాజపాకు లభించిన అనుకూల ఫలితాలు అందించిన ధీమాతో.. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఈ వేడిమీదనే ఎన్నికలకు వెళితే.. తమ పార్టీకే పూర్తి మెజారిటీ దక్కుతుందనేది వారి ఆశ. శివసేనకు సీను అర్థమై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వినికిడి. ఇటీవలి కాలంలో మోదీ సర్కారు తీసుకుంటున్న కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాల విషయంలో శివసేన కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతుండడం, మిగిలిన మిత్రపక్షాల్లాగా మోదీ భజన చేయడానికి ఎంతమాత్రం వారు ఇష్టపడకపోవడం చూస్తుంటే విడాకులకు వారూ సిద్ధమేనని అర్థమవుతోంది.
అయితే.... యూపీ వంటి చోట కూడా ఫుల్ మెజార్టీ సాధించిన బీజేపీ ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన బలం మీద కూడా ఆధారపడి ఉంది. అందుచేత వారిని వదిలించుకోవడానికి అక్కడ మధ్యంతర ఎన్నికలు ఒక్కటే మార్గం అని భాజపా భావిస్తున్నట్లుంది. చూడబోతే ఈ ఏడాది మహారాష్ర్టలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. మరి... ఎన్నికలకు వెళ్తే యూపీలాంటి విజయం బీజేపీకి వస్తే సరేసరి.. లేదంటే మాత్రం శివసేనతో వ్యవహారం చెడగొట్టుకున్న ఫలితం అనుభవించక తప్పదంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/