Begin typing your search above and press return to search.
ఏపీలో అర్ధరాత్రి భారీగా ఐఏఎస్ బదిలీలు !
By: Tupaki Desk | 24 July 2021 4:48 AM GMTఏపీ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం , వారి స్థానంలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(జులై 23) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కర్నూలు, కడప జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... కడప జిల్లా కలెక్టర్ గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్,కర్నూలు కలెక్టర్ గా కోటేశ్వరరావు, విజయనగరం జిల్లా కలెక్టర్ గా సూర్యకుమారి, విశాఖ కలెక్టర్ గా ఎ.మల్లిఖార్జునలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక ,పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా సుమిత్ కుమార్,శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బీఆర్ అంబేడ్కర్,చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా స్వప్నిల్ దినకర్ లను నియమించింది. వైద్యశాఖ ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీగా మురళీధర్ రెడ్డి,ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్ చంద్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గా హరి జవహర్ లాల్, పౌర సరఫరాల శాఖ వీసీ,ఎండీగా వీరపాండియన్,విశాఖ వీఎంఆర్‌డీఏ కమిషనర్ గా వెంకటరమణా రెడ్డి, చేనేత శాఖ డైరెక్టర్ గా పి.అర్జున్ రావు, దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్, శాప్ ఎండీగా ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆక్టోపస్ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ గా విక్రాంత్ పాటిల్, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా గరుడ్ సుమిత్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్గా అజితా వేజెండ్ల బదిలీ అయ్యారు.
గత నెలలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్న గంధం చంద్రుడును గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు. వీరి స్థానంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్ నియమితులయ్యారు.