Begin typing your search above and press return to search.

మిగ్-21.. దీని పవర్ మామూలుగా లేదు..

By:  Tupaki Desk   |   1 March 2019 3:32 PM IST
మిగ్-21.. దీని పవర్ మామూలుగా లేదు..
X
58 ఏళ్ల క్రితం అది భారత వైమానిక దళంలో చేరింది. మరో రెండేళ్లు గడిస్తే షష్ఠి పూర్తి పూర్తి చేసుకుంటుంది. అటువంటి యుద్ధవిమానం మిగ్ -21. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయరైన ఈ విమానం శత్రువు పాలిట సింహస్వప్నంగా మారింది. దీన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటిడ్ 1961లో తయారు చేసి ఇచ్చింది. ఆ తర్వాత కాలానుగుణంగా ఆ యుద్ధ విమానం అప్ డేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా మారింది.

పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన మిగ్ 21 సత్తా చాటింది. నిజానికి ఎఫ్ 16తో పోల్చితే మిగ్ 21 శక్తి సామర్థ్యాలు చాలా చాలా తక్కువ. కానీ మిగ్ 21తో పైలెట్ అభినందన్ వెంటాడి వేటాడి నేలకూల్చాడు.

మిగ్ పూర్తి పేరు మికోయన్-గురేవిచ్. దీన్ని రష్యా తయారుచేసింది. ఆ తర్వాత భారత్ కొని దాన్ని డెవలప్ చేసింది. మిగ్ 21 ఎఫ్ ఎల్, మిగ్ 21 ఎం, మిగ్ 21 బైసన్ రకాలు ప్రస్తుతం భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం వైమానిక దళంలో 657 మిగ్ 21 యుద్ధ విమానాలున్నాయి. 1965 నాటి యుద్ధంలో శతృదేశానికి అధునాతన ఎఫ్-104 స్టార్ ఫైటర్లను కూడా మిగ్ నేలకూల్చింది. 1971యుద్ధంలోనూ పాక్ కు చెందిన తొమ్మిది యుద్ధవిమానాలను నేలకూల్చాయి. 1999లో సంభవించిన కార్గిల్ యుద్ధంలోనూ మిగ్ తో శత్రువులను చీల్చిచెండాడారు.

మిగ్ లు వరుసగా ప్రమాదాల బారిన పడడంతో దీన్ని రక్షణ శాఖ ఆధునీకరించి ‘బైసన్’ రకంగా మార్పులు చేసింది. ఆధునిక వ్యవస్థలను జోడించింది. మల్టీమోడ్ రాడర్, ఎలక్ట్రానిక్ వ్యవస్తలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. శత్రువుల విమానాలను నేలకూల్చే ఆర్79, ఆర్77 క్షిపణులను కూడా మోసుకొళ్లేలా మిగ్ ను తయారు చేశారు. ప్రత్యర్థుల దాడిని తప్పించుకునే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇలా షష్టిపూర్తికి దగ్గరైనా భారత అమ్ముల పొదిలో ఇప్పటికీ మిగ్ యుద్ధ విమానాలు కీలకంగా ఉన్నాయి.