Begin typing your search above and press return to search.
బారికేడ్లు విరగ్గొట్టి మధురలో వలస కార్మికుల బీభత్సం
By: Tupaki Desk | 17 May 2020 1:29 PM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయంపై వలస కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బారికేడ్లు విరగ్గొట్టి ఆందోళన చేస్తూ బీభత్సం సృష్టించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిలిపివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ రాష్ట్రంలో వలస కార్మికులను ఎక్కడికక్కడ ఆపివేశారు. వలస కార్మికులను సొంత ప్రాంతాలకు వెళ్లడాన్ని నిలిపివేయడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామంతో మధురలో సుమారు 130 మంది వలస జీవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నచోట సరైన ఆహారం లేక, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. దీంతో ఒక్కసారిగా వారంతా తమ కుటుంబాలతో మధుర శివారులోని జాతీయ రహదారిపైకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బ్యారికేడ్లను విరగ్గొట్టి పరుగులు తీశారు. మధుర నగరంలోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఒక్క అధికారి - పోలీస్ కూడా లేకపోవడంతో వలస కార్మికులు మధుర నగరంలోకి ప్రవేశించారు. నిలిపివేస్తే తమకు ఆహారం - షెల్టర్ అందించాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదని - తమను ఆపేసి వదిలేశారని వలస కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఆందోళనతో మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ మీదుగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కార్మికులు భావిస్తున్నారు.