Begin typing your search above and press return to search.
వలస కూలీలపై క్లోరినేషన్ స్ప్రే ..ఎందుకంటే !
By: Tupaki Desk | 23 May 2020 9:30 AM GMTఈ మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న కేసుల సంఖ్యని తగ్గించడానికి మరో మార్గం లేక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరు అనేక ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు కష్టాలు వర్ణనాతీతం. ఈ లాక్ డౌన్ సమయంలో ఉన్న చోట తిండి లేక ..ఉపాధి లేక వేల కిలోమీటర్లు రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఇలా సొంత గ్రామాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఇక సొంత గ్రామాలకు వెళ్లే వారిలో చాలా మంది ఆక్సిడెంట్ లకు గురైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వలస కార్మికులను తరలించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీలో సొంత ఉరికి వెళ్లడానికి కూలీలు రైల్వస్టేషన్ కు చేరుకున్నారు. కార్మికులు రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మున్సిపల్ కార్మికుడు వారిపై క్లోరినేషన్ స్ప్రే చేసాడు. దీనితో వారి కళ్ళలో మంటలు వచ్చాయి. కళ్ళలో మంటలు రావడంతో వారి భాధలు వర్ణనాతీతం. ఇప్పటికే కోరినేషన్ చల్లడం వల్ల వైరస్ చావదని దానితో మనుషుల ఆరోగ్యానికే ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అయినప్పటికీ ఢిల్లీలో మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.