Begin typing your search above and press return to search.
రోడ్డుపైకి పోటెత్తిన కార్మికులు!
By: Tupaki Desk | 3 May 2020 10:10 AM GMTసొంతూరికి వెళ్లడానికి ప్రతి సామాన్యుడు అవకాశం కోసం ఆశగా చూస్తున్నారు. లాక్ డౌన్ మూడోసారి పొడిగించడంతో ఇక ఎపుడు ముగుస్తుందో తెలియని అయోమయం వల్ల ఊర్లో అయినా ఉంటే ఉప్పు మిరపకాయితో అయినా కాసింత ముద్ద తిని బతకొచ్చు అని సొంతూరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒకటో తేదీ గవర్నమెంటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్మికులను సొంతూరికి పంపండి అంటూ ఆదేశాలు జారీ చేసేటప్పటికి ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది జీవితాల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫోన్ నెంబర్లకు కాల్స్ పోటెత్తుతున్నాయి.
టోలీ చౌకి ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు రోడ్ల మీదకు వచ్చి మమ్మల్ని ఊరికి పంపండి అంటూ నిరసనలు చేయడం మొదలుపెట్టారు. సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసుల్లో కంగారు మొదలైంది. వారితో మాట్లాడిన పోలీసులు మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు
ప్రతిఒక్కరిని ప్రభుత్వం సొంతూళ్లకు పంపిస్తుంది. మేము మీ వినతి ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాం అని ఒప్పించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా కార్మికులతో మాట్లాడారు. పోలీసుల మాట విని కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీలైనంత త్వరగా తమను ఊళ్లకు పంపించండి అంటూ పోలీసులను కోరారు.
ఎందుకిలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరాతీస్తే వదంతులే కారణమని తేలింది. గవర్నమెంటు బస్సులు రైళ్లు పెట్టిందని ఇక్కడ జంక్షన్లో ఉన్నాయని వదంతులు సృష్టించారని అందువల్ల వారంతా రోడ్లపైకి వచ్చారని పోలీసులు తెలిపారు. వారందరికీ ఇక్కడ పనిలేక ఆదాయం లేదు. ఆదాయ రాక... ఆహారం దొరకడం కష్టమవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో వారు ఊరికెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. వారి ఇబ్బందులు గుర్తించి ఆహారం ఏర్పాటుచేయడానికి జీహెచ్ ఎంసీతో మాట్లాడామని పోలీసులు తెలిపారు.