Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పరిస్థితి మరీ ఇంత ఘోరమా..?

By:  Tupaki Desk   |   9 Sept 2018 5:36 PM IST
ట్రంప్‌ పరిస్థితి మరీ ఇంత ఘోరమా..?
X
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ పై రకరకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసింది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచే ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నా ఎలాగోలా ఎన్నికల్లో విజయం సాధించారు. అయనా అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంత మంది అమ్మాయిలతో ట్రంప్‌ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారని - అంతకుముందు మంచి రసికుడని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే మీడియా ముందుకు వచ్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ఆ తరువాత వివిధ సంస్కరణల పేరుతో ఇతర దేశాలతోనూ ట్రంప్‌ విభేధాలు తెచ్చుకుంటూ వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు.

తాజాగా ట్రంప్‌ ఓ విషయంలో చాలా ఛీప్‌ గా వ్యవహరించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వైట్‌ హౌజ్‌ లో 2017 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా కంటే ఎక్కువ జనం వచ్చారని చెప్పారు. అయితే ట్రంప్‌ చెప్పిన విషయాలన్నీ అబద్దమేనని ఇటీవల తేలింది. తన ప్రాధాన్యతను చెప్పుకోవడానికి ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడని ద గార్డియన్‌ అనే పత్రిక బయటపెట్టింది.

ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ రేనాల్డ్స్‌ను కార్యక్రమ విశేషాలను అడిగారు. ఆ తరువాత ఫొటోలను చూపించమన్నారు. అయితే అంతకుముందు అధ్యక్షుడు ఒబామా కంటే ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి జనం తక్కువగా వచ్చారు. దీంతో ప్రభుత్వ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి మీడియాకు విడుదల చేశాడట. గత సంవత్సరం ఓ ఇన్వెస్టిగేషన్‌ సంస్థ నిర్వహించిన పరిశోధనలో ఈ నిజాలు బయటపడ్డారు. ఇప్పటికే ఎన్నో చర్యల వల్ల ట్రంప్‌పై ఆరోపణలు వస్తుంటే తాజాగా వచ్చిన ఆరోపణలపై ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.