Begin typing your search above and press return to search.
అది తాగేందుకు నెలకు రూ.28.38 లక్షలు ఖర్చు చేస్తాడట
By: Tupaki Desk | 16 Aug 2019 5:55 AM GMTఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరుగా మాజీ బాక్సర్ మైక్ టైసన్ ను చెప్పాలి. పిన్న వయసులోనే బాక్సింగ్ రికార్డుల్నితిరగరాయటమే కాదు.. తనతో పోరుకు రింగులోకి దిగాలంటేనే వణుకు పుట్టేలా చేసిన అతి కొద్దిమందిలో టైసన్ ఒకరు. 20 ఏళ్ల వయసులోనే హెవీ వెయిట్ ఛాంపియన్ గా అవతరించిన టైసన్.. బాక్సింగ్ కు స్వస్తి చెప్పటం తెలిసిందే.
ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. బాక్సింగ్ వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటించే టైసన్ కు సంబంధించి మరో కోణం ఉంది. ప్రపంచ క్రీడా సెలబ్రిటీల్లో ఎవరూ చేయని వ్యాపారం చేయటం ఆయన స్పెషాలిటీ. కాలిఫోర్నియాలో డ్రగ్స్ వ్యాపారాన్ిన నిర్వహించే ఆయన..సినిమాలతోనే కాదు.. డ్రగ్స్ వ్యాపారంలోనూ దూసుకెళ్తున్నాడు. కాలిఫోర్నియాలో డ్రగ్స్ బిజినెస్ చట్టబద్ధం కావటంతో అతడు చేసే పని తప్పు అని చెప్పలేం.
వీడ్ డ్రగ్స్ ను పండిస్తుంటాడు టైసన్. దీన్ని భారీ ఎత్తున వ్యాపారం చేస్తుంటాడు. తన బిజినెస్ పార్టనర్ ఎబెన్ బ్రిట్టన్ తో కలిసి చేస్తున్న ఈ వ్యాపారానికి సంబంధించిన కొన్ని వివరాల్ని తాజాగా ఆయన వెల్లడించారు. హాట్ బాక్సిన్ విత్ మైక్ టైసన్ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న టైసన్.. పలు ఆసక్తికర అంశాల్ని బయటపెట్టారు. తాను.. తన బిజినెస్ పార్టనర్ ఇద్దరం కలిసి.. నెలకు డ్రగ్స్ కోసం పెట్టే ఖర్చు లెక్క చెప్పి షాకిచ్చాడు. తాను పండించే వీడ్ ను నెలకు భారీగా పీల్చేస్తుంటామని.. దాని విలువ రూపాయిల్లో చెప్పాలంటే నెలకు రూ.28.38 లక్షల వరకూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. తనకు వీడ్ తప్పించి మరే డ్రగ్ తోనూ సంబంధం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒక డ్రగ్ కోసం ఒక మాజీ క్రీడా ప్రముఖుడు అంత ఖర్చు చేస్తున్నాడంటే.. అతగాడి ఆదాయం ఇంకెంత ఉంటుందో?