Begin typing your search above and press return to search.
సిక్కోలులో భూమి మళ్లీ కంపించింది
By: Tupaki Desk | 8 Jan 2016 8:13 AM GMTఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మరోసారి భూప్రకంపనలకు గురయ్యాయి. ఈ మధ్యకాలంలో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న కారణంగా తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న శ్రీకాకుళం జిల్లా మరోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది.
శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో జిల్లాలోని పొందూరు మండలం కృష్ణాపురం.. లోలుగు.. పుల్లాజీ పేట.. దెల్లిపేట లలో మూడుసెకన్ల పాటు భూమి ప్రకంపనలకు గురైంది. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెనువెంటనే.. వారు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
గడిచిన నెల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలకు గురి కావటం అక్కడి వారిని ఆందోళనలకు గురి చేస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ప్రకంపనలు స్వల్పమైనవేనని.. వీటి కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెబుతున్నారు.