Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు రంగంలోకి మిలిటరీ

By:  Tupaki Desk   |   18 May 2022 5:47 AM GMT
కరోనా దెబ్బకు రంగంలోకి మిలిటరీ
X
ఉత్తర కొరియా లో కరోనా వైరస్ అందరినీ వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో 2.7 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారికంగానే ప్రకటించారు. వేలు, లక్షల్లో పెరిగిపోతున్న కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా అవకాశాలు ఉండటం లేదు. ఆసుపత్రులు లేరు, తగినంత మంది వైద్య నిపుణులు, మెడికల్ స్టాఫ్ కూడా లేరు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు లేవు. యావత్ ప్రపంచం కోవిడ్ టీకాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే ఉత్తరకొరియా మాత్రం అసలు టీకాలనే దగ్గరకు రానీయలేదు.

దాని ఫలితంగా ఇపుడు లక్షల్లో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. అందుకనే కరోనా వైరస్ నియంత్రణకు అద్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మిలటీరీని రంగంలోకి దింపారు. దేశంలోని జనాలందరికీ ముందు కరోనా వైరస్ నిర్దారిత పరీక్షలు చేయించటం మొదలుపెట్టారు.

అలాగే వైరస్ నిర్ధారితమైన రోగులను వెంటనే ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, డాక్టర్లు, స్టాఫ్ తోనే వైద్య సేవలు అందిస్తున్నారు.

వైరస్ తీవ్రంగా లేనివాళ్ళని ఇళ్ళల్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్నారు. కరోనా వైరస్ నిర్దారిత కిట్లు కూడా లేకపోవటంతో జ్వరంతో బాధపడుతున్నవారందరినీ కరోనా వైరస్ బాదితులుగానే ప్రభుత్వం పరిగణిస్తోంది. కిమ్ తన అనాలోచిత నిర్ణయాల కారణంగా ఇపుడు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పాటు తాను కూడా కోవిడ్ టీకాలను తెప్పించి, జనాలకు వేయించుంటే ఇపుడు ఉత్తర కొరియా లో ఈ పరిస్థితి దాపురించేది కాదేమో.

కరోనా దెబ్బకు సరైన వైద్యం అందకపోవటంతో వందల మంది చనిపోయారు. తమ దేశంలోకి ఎప్పటికీ కరోనా వైరస్ ప్రవేశించే అవకాశమే లేదన్న మూర్ఖపు ఆలోచనతోనే కిమ్ ఇంతకాలం గడిపేశారు. కరోనా అనేది కిమ్ అనుమతి తీసుకుని దేశంలోకి ప్రవేశిస్తుందా ?

దానికేమైనా పాస్ పోర్టు, వీసాలు అవసరమా ? పొరుగునే ఉన్నా చైనా దెబ్బకు ఉత్తరకొరియాలో కరోనా వైరస్ ప్రవేశించిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ రెండుదేశాల మధ్య ఉన్న బంధం కారణంగా జనాల రాకపోకలు చాలా ఎక్కువ.