Begin typing your search above and press return to search.

కరోనాతో అమెరికా దివాళేనా?

By:  Tupaki Desk   |   27 March 2020 6:21 AM GMT
కరోనాతో అమెరికా దివాళేనా?
X
అమెరికాను కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీస్తోంది. వ్యాధి సోకడమే కాదు.. కరోనాతో మూతపడుతున్న పరిశ్రమలు, వ్యవస్థల వల్ల వేలాది మంది రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనాతో మొత్తం పరిశ్రమలు, వ్యాపారాలు బంద్ అవుతున్న వేళ లక్షలాది మంది రోడ్డున పడుతున్నారు.

అమెరికాను కరోనా వైరస్ ఆవహించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో చైనాను అమెరికా దాటేయడం గుబులు రేపుతోంది.. ఇప్పటివరకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82547కు చేరింది. అమెరికాలో తాజాగా నిన్న ఒక్కరోజే ఏకంగా 13785మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82వేలు దాటింది.

ఈ క్రమంలో కంపెనీలు, పరిశ్రమలు, వివిధ సంస్థలు మూతపడుతున్నాయి. ఇది అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. దీంతో మార్చి 21 వరకే ఏకంగా అమెరికాలో 32.83 లక్షల మంది రోడ్డున పడ్డ పరిస్థితి కనిపించింది. 32 లక్షల మంది జాబ్ ల కోసం క్లెయిమ్స్ పెట్టుకోవడం.. చేస్తామని అప్లికేషన్లు పెట్టుకోవడం అమెరికాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది.

మార్చి 21నాటికి గడిచినవారంలో అమెరికాలో 3.28 మిలియన్స్ మంది అమెరికన్లు జాబ్ లెస్ క్లెయిమ్స్ పెట్టుకోవడంతో కరోనా కారణంగా అమెరికాలో ఎంతటి పెను విధ్వంసం చోటుచేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యధిక క్లెయిమ్ హిస్టరీ అంట.. కరోనా కనుక మరింత ఎక్కువైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమన్న భయం అక్కడి వారిని వెంటాడుతోంది.