Begin typing your search above and press return to search.

నిన్న బిలియనీర్.. నేడు చిరువ్యాపారి.. అయినా ఓటమి ఒప్పుకోలేదు..!

By:  Tupaki Desk   |   25 Nov 2022 2:30 AM GMT
నిన్న బిలియనీర్.. నేడు చిరువ్యాపారి.. అయినా ఓటమి ఒప్పుకోలేదు..!
X
నిన్నటి నిన్న ఆయనో బిలియనీర్.. ఎంతో లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేశాడు.. సీన్ కట్ చేస్తే.. నేడు ఆయన రోడ్లపై చిరు వ్యాపారిగా మారాడు. తనపై ఉన్న 52 కోట్ల అప్పును తీర్చేందుకు ప్రస్తుతం రోడ్లపై మాంసం అమ్మకుంటూ జీవించాల్సిన దుస్థితి నెలకొంది. అయినప్పటికీ ఆ వ్యక్తి స్టోరీ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం విశేషం. ఇంతకీ అతడి స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

తాంగ్ జియన్ (52) అనే వ్యక్తి చైనాలో ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 36 ఏళ్ళ వయస్సులోనే రెస్టారెంట్ల రంగంలో తన ఉనికిని చాటుకోని కోట్ల రూపాయాలను ఆర్జించాడు. ఈ క్రమంలోనే తాంగ్ జియాన్ మరో రంగంలోకి అడుగు పెట్టాడు. 2005 సంవత్సరంలో తనకు ఏమాత్రం అవగాహన లేని ల్యాండ్ స్కేప్ ఇంజనీరింగ్ పరిశ్రమలో తాంగ్ జియాన్ భారీగా పెట్టుబడులు పెట్టాడు.

అయితే కరోనా దెబ్బకు చైనాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింది. ఈక్రమంలోనే తాంగ్ జియన్ భారీగా నష్టపోవాల్సి రావడంతో తనకున్న రెస్టారెంట్లు.. ఇళ్లు.. కార్లు అమ్ముకున్నాడు. అయినప్పటికీ అతడిపై 52కోట్ల అప్పు మిగిలిపోయింది. ఈక్రమంలోనే తనకు అచ్చి వచ్చిన ఫుడ్ రంగాన్నే తాంగ్ జియన్ నమ్ముకున్నాడు.

హంగ్ ఝౌలోని ఒక వీధిలో చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. మాంసంతో తయారు చేసిన ఫుడ్ ను విక్రయిస్తూ తన అప్పును తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. "నేను అమ్మే మాంసాహారంలో ఎలాంటి పిండి ఉండదు.. అచ్చంగా మాంసమే.. పార్కులు.. మార్కెట్లో లభించే మాంసంతో పొలిస్తే ఇది ఎంతో మేలైనది" అంటూ కొత్త తరహాలో వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తాంగ్ జియన్.

ఈక్రమంలోనే పలువురి అతడి దుస్థితిపై ప్రశ్నంచగా... ప్రతీ ఒక్కరి జీవితం సవాళ్లతో గడుస్తుందని... ఎన్నో కష్ట నష్టాలను చవి చూసి ఉంటారని చెబుతున్నాడు. జీవితం మనకు ఎన్ని సవాళ్లు విసిరినా ఓటమిని మాత్రం అంగీకరించకూడదని... ఆశావాదంతో ముందుకు సాగాలని తాంగ్ జియన్ సూచిస్తున్నాడు.

ఏది ఏమైనా బిలియనీర్ స్థాయి నుంచి రోడ్డు వ్యాపార స్థాయికి తాంగ్ జియన్ పడి పోయినా అతడి మొఖంలో మాత్రం చిరునవ్వు దూరం కాలేదని చైనీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజ్ జియన్ చూపిస్తున్న తెగువ అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉండటంతో అతడి స్టోరీ చైనాలో వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.