Begin typing your search above and press return to search.

బెంగళూరుకు లక్షలమంది బంగ్లాదేశీయులు.. ఎందుకొచ్చారంటే?

By:  Tupaki Desk   |   31 Jan 2020 7:46 AM GMT
బెంగళూరుకు లక్షలమంది బంగ్లాదేశీయులు.. ఎందుకొచ్చారంటే?
X
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 3 లక్షల మంది.. మన దేశ వాసులు కాదు.. బీజేపీ ప్రభుత్వం బహిష్కరించిన బంగ్లాదేశీయులు..అక్రమంగా బెంగళూరులో నివాసం ఉన్నారు. సీఏఏ, ఎన్సార్సీ చట్టాలకు పదును పెడుతున్న వేళ బంగ్లాదేశ వాసులు ఇంత మంది బెంగళూరు లో ఉండడం కలకలం రేపే విషయం.. తాజాగా ఈ విషయం వెల్లడైంది.

బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు సంచలన విషయం బయటపెట్టాడు. పౌరసత్వం సవరణ చట్టం అమలు చేయబోతున్న తరుణం లో ఆయన స్పందించారు. కేవలం బెంగళూరు పట్టణం లోనే 3 లక్షల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని సీపీ సంచలన విషయం తెలిపారు. 3 లక్షల కంటే ఎక్కువే ఉన్నారని వివరించారు.

బెంగళూరు ఐఐఎం ఆధ్వర్యం లో నిర్వహించిన ఓ సదస్సులో భాగంగా ఈ విషయాలను సీపీ వెల్లడించారు. బెంగళూరు లో అక్రమంగా చొరబాటుదారులు పెరిగి పోతున్నారన్నారు. ఇప్పటి వరకూ 61మందిని గుర్తించి బహిష్కరించినట్టు తెలిపారు. బెంగళూరు ఎకనామిక్ హబ్ గా మారిందని.. అందుకే ఇక్కడికి వలసలు పెరిగినట్టు తెలిపారు. వీరందరినీ గుర్తించి దేశం నుంచి పంపడం కష్టమని అభిప్రాయ పడ్డారు.