Begin typing your search above and press return to search.
హోమ్ ఐసోలేషన్ లో లక్షమంది కరోనా బాధితులు !
By: Tupaki Desk | 5 May 2021 12:01 PM ISTదేశంతో పాటుగా , ఏపీలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అందిన తాజా గణాంకాల ప్రకారం లక్ష మందికిపైగా కరోనా వైరస్ మహమ్మారి బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంలు నిత్యం పర్యవేక్షిస్తూ సకాలంలో స్పందిస్తుననారు. 104 కాల్ సెంటర్ వైద్యులు ఫోన్ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుని సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కేర్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.
ప్రస్తుతం 9వేల 937 మంది బాధితులు కరోనా వైరస్ కేర్ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల యాక్టివ్ కేసుల్లో 37వేల 760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేర్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే, ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కరోనా కేర్ సెంటర్ కు రావాలని సూచిస్తున్నారు. మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కరోనా చికిత్స అందిస్తుండగా.. 44వేల 559 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆయాసం ఎక్కువ ఉంటే.. సాధారణ మందులు వాడి కరోనా నుంచి కోలుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోకుండా ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లమని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో ఇవాళ్టి నుంచి డే కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. డే కర్ఫ్యూకు సంబంధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. పాక్షిక లాక్ డౌన్ లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సమయంలో ఏపీలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంది. ఇవాళ్టి నుంచి 16 గంటలు కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించడంతో కరోనా బాధితుల వైద్య సేవల కోసం అవసరమైన ఆక్సిజన్ స్టోరేజీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.