Begin typing your search above and press return to search.
భారత్ కు కరోనా తెచ్చిన నష్టం లక్షల కోట్లు!
By: Tupaki Desk | 1 May 2020 2:30 AM GMTకరోనా వైరస్ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. రెండో దశ లాక్‌డౌన్ ముగుస్తున్న కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారోమోననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రెండు దశల లాక్‌డౌన్‌తో భారతదేశం ఎంతో నష్టపోయింది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో అన్నీ రంగాలు మూతపడి పోవడంతో దేశంలో ఎన్నడు లేనట్టు ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడింది.
లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించాయి. దీనివలన రోజుకు రూ.35,000 నుంచి 40,000 కోట్లు నష్టం సంభవిస్తోంది. ఇప్పటివరకు నెలకు పైగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీని వల్ల దేశానికి రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల వరకు నష్టం ఉండొచ్చనే అంచనా వచ్చింది. ఇంతలా భారత దేశంలో నష్టం ఎప్పుడూ రాలేదు. ఈ లాక్‌డౌన్‌తో పేద మధ్య తరగతి, సంపన్నులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
లాక్‌డౌన్ ప్రభావం ముఖ్యంగా ఉపాధిపై తీవ్రంగా పడింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆదాయం కోల్పోతున్నారు. దాదాపు 37.3 కోట్ల మంది వర్కర్లు లాక్ డౌన్ లో రోజుకు దాదాపు రూ.10,000 కోట్లు కోల్పోయారని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారు, రెగ్యులర్, క్యాజువల్ వర్కర్లు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. 40 రోజుల లాక్‌డౌన్‌తో ఏకంగా రూ.4.05 లక్షల కోట్ల నష్టం ఏర్పడిందని పలు లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇక లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వృద్ధి రేటు క్షీణ దశకు చేరి మైనస్‌లోకి వెళ్లిందని ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇప్పటికే లాక్‌డౌన్‌తో జీడీపీ రేటు అత్యల్పంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నాయి. మూడీస్ ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 0.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఐఎంఎఫ్ వృద్ధి రేటు అంచనాలు 1.9 శాతంగా ఉండగా, ఫిచ్ భారత్ జీడీపీ వృద్ధి 0.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కలు ఇలా ఉండగా నొమురా మాత్రం భారత వృద్ధి రేటు మైనస్ లోకి వెళ్తుందని పేర్కొంది. బార్‌క్లేస్ అయితే వృద్ధి రేటు సున్నగా ఉండొచ్చని తెలిపింది.