Begin typing your search above and press return to search.
ఎంఐఎం తొలిజాబితా.. అభ్యర్థులు వీరే..
By: Tupaki Desk | 11 Sep 2018 10:59 AM GMTటీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం.. తమ పార్టీ తరఫున 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి దూకేయడం తెలిసిందే.. ఈ నేపథ్యంలో విపక్షాలు కూడా అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. తాజాగా మజ్లిస్ పార్టీ కూడా తన స్థానాలను కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. టీఆర్ ఎస్ తో సాన్నిహిత్యం నెరుపుతూ తమ స్థానాల్లో నెగ్గడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీపై ఎంఐఎంకు తిరుగులేని పట్టు ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎంఐఎంను కొట్టే పార్టీ లేదు. ఈ నేపథ్యంలోనే దూకుడుగా అభ్యర్థులను ప్రకటించేసింది. తమ పట్టు నిలుపుకోవడానికి తాజాగా ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని ఏడు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే..
చంద్రాయణ గుట్ట-అక్బరుద్దీన్ ఓవైసీ
యాకుత్ పుర- సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ
చార్మినార్ : ముంతాజ్ అహ్మద్ ఖాన్
బహదూర్ పూర: మహ్మద్ మొజంఖాన్
మలక్ పేట్ : అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
నాంపల్లి -: జాఫర్ హుస్సేన్ మేరాజ్
కార్వాన్ : కౌసర్ మొహిద్దీన్,
తాజాగా ఎంఐఎం ప్రకటించిన అభ్యర్థుల్లో పాత వారిని ఇద్దరిని మార్చేసింది. గతంలో పాషా ఖాద్రీ చార్మినార్ నుంచి పోటీచేయగా.. ప్రస్తుతం యాకుత్ పుర అసెంబ్లీ సీటును అతడికి కేటాయించారు. గత ఎన్నికల్లో యాకుత్ పుర నుంచి పోటీచేసిన అహ్మద్ ఖాన్ ను చార్మినార్ కు మార్చారు.