వందేళ్లలో భారత్ ముస్లిం దేశం
By: Tupaki Desk | 4 Dec 2015 8:34 AM GMTహిందూస్థాన్ అనే నాగరిక నామం కాస్త భారతదేశం అనే వ్యవహారిక నామంగా మారిన మనదేశం త్వరలో ముస్లిం దేశంగా మారిపోనుందా? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వేగంగా పెరిగిపోతున్న ముస్లింల వల్ల భారతదేశంలో హిందువులే మైనార్టీలు కానున్నారా? ఈ సందేహాలు అన్నివర్గాల్లోనూ సహజంగానే రేకెత్తుతున్నాయి. కానీ ముస్లింలను మత పరంగా చీల్చడంలో..తద్వారా వారితో రాజకీయం చేయడంలో ముందుండే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.
బాబ్రీ మసీదును కూల్చివేత జరిగి ఈ డిసెంబరు 6నాటికి 23 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చిన శుక్రవారం సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి అసదుద్దీన్ ప్రసంగించారు. భారతదేశం లౌకికదేశం అని పేర్కొంటూ ఈ దేశంలో సర్వమతాల వారు నివసించే హక్కు ఉందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని "ఒకమతం" వారికే పరిమితం చేసేలా సంఘ్ పరివార్ ప్రయత్నం చేస్తోందని అసద్ మండిపడ్డారు. ఈ క్రమంలో సంఘ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నంగా శాయశక్తులా కృషిచేస్తామని చెప్పారు.