Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం దాడి
By: Tupaki Desk | 2 Feb 2016 3:45 PM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్బంగా పాతబస్తీలో పూర్వపు మిత్రపక్షాలైన ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఏకంగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై దాడి జరిగింది.
చార్మినార్ పరిధిలోని పురానాపూల్ లో మహేశ్వరి విద్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రి - కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్ధి మహ్మద్ గౌస్ మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న దక్షిణమండలం డీసీపీ సత్యనారాయణ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఖాద్రి, అలాగే గౌస్ లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్ పోలీసు స్టేషన్ వద్దకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తన కార్యకర్తలతో వచ్చారు. ఈ నేపథ్యంలోఅక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో స్వల్ప ఉధ్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్ - షబ్బీర్ ఆలీకి స్వల్పగాయలయ్యాయి. ఎంఐఎం కార్యకర్తలు అక్కడే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు.
ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ - వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తదితర నేతలు డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అసలు పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఉందా? అంటూ మండిపడ్డారు. అధికార టీఆర్ ఎస్ సర్కారు అండ చూసుకుని ఎంఐఎం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుండాలు, రౌడీలతో ఎంఐఎం తమపై దాడి చేయించిందన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ యావత్తూ తమదేనని ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. ఈ తీరుకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.