Begin typing your search above and press return to search.
ముంబై ఎన్నికల్లో ఎంఐఎం బోణి
By: Tupaki Desk | 23 Feb 2017 4:40 PM GMTహైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి దాటి పక్క రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని కలలు కంటున్న ఓవైసీల కల నెరవేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎంఐఎం సత్తా చాటింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న జిల్లా, పురపాలిక ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. ఎంఐఎం తరఫున బరిలో నిలిచి వారిలో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో మొత్తం 59 చోట్ల పోటీ చేసింది
పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రను ప్రథమ ప్రాధాన్యంగా ఎన్నుకున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఔరంగాబాద్, బైకుల్లా స్థానాలలో గెలవడంతో తమ పార్టీకి అక్కడ పట్టుందని భావించి బీఎంసీ ఎన్నికలకు ముందు నుంచే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో 59 చోట్ల పోటీ చేయించగా ముగ్గురిని విజయం వరించింది. అయితే ఎంఐఎం సత్తా నేపథ్యంలో 6-8 మంది గెలుస్తారని పలువురు అంచనా వేశారు కానీ మూడు చోట్లే ఎంఐఎం గెలిచింది. మొత్తంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలోనూ ఓవైసీల జెండా ఎగిరినట్లయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/