Begin typing your search above and press return to search.
శివరాత్రి మరుసటి రోజు సెలవు ఇవ్వాలి: ఒవైసీ
By: Tupaki Desk | 18 March 2015 11:17 AM GMTహైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అన్నా..లేదా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలన్నా తమ ఇలాకా అనే భావనను ముస్లిం భావజాలం తీవ్రంగా ఉన్న ఎంఐఎం నమ్ముతోంది. దురదృష్టవశాత్తు ఫలితాలు సైతం అదే విధంగా వస్తున్నాయి. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం వారసత్వ నాయకులైన ఓవైసీలు భయపడుతున్నారు. ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే కేవలం ముస్లిం ఓట్లను నమ్ముకుంటేనే సరిపోదని ఇతర వర్గాలనూ దువ్వుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఇందుకు ఎత్తుగడ వేస్తున్నారు.
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యాదగిరి గుట్ట అభివృద్ధికి చర్యలు తీసుకోవడం మంచిదేనని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని చర్చిలను సైతం బాగుపర్చాలని కోరారు. రంజాన్, క్రిస్‌మస్‌లతో పాటు శివరాత్రికి సెలవులు ఇవ్వాలని సభ వేదికగా డిమాండ్ చేశారు. శివరాత్రి జాగారం చేసిన మరుసటి రోజు విధులకు హాజరుకావాలంటే ఇబ్బందిగా ఉంటుందని, అందుకే మరుసటి రోజుకూడా సెలవు ఇవ్వాలని కోరారు.
ఎప్పుడూ ముస్లింల గురించి మాత్రమే మాట్లాడే ఓవైసీ హిందువుల గురించి, చర్చిల అభివృద్ధి గురించి చర్చిండం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ రెండు వర్గాలకు అనుగుణంగా మాట్లాడటం ద్వారా వారి ఓట్లను రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు గా ఇరవై రోజుల క్రితం నగరంలో ఎంఐఎం పార్టీ ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్య సదస్సు నిర్వహించింది. ఆయా వర్గాలకు చెందిన కొందరితో సమావేశం ఏర్పాటుచేయించి ఆ భేటీకి ఓవైసీలు హాజరయ్యారు.
మొత్తంగా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఓవైసీల్లో గుబులు పుట్టిస్తున్నాయా? అన్నివర్గాలను నమ్ముకోకుంటే ఓటమి తప్పదనే భావనలో ఉండటం వల్లే ఇదంతా చేస్తున్నారనే చిన్న ఆంతర్యాన్ని ఓటర్లు గ్రహించలేరనే భ్రమల్లో ఉండబట్టే కదా వీరీ వ్యాఖ్యలు చేసింది!!