Begin typing your search above and press return to search.
మజ్లిస్ ఎమ్మెల్యే నోట గణపతి బప్పా..!!
By: Tupaki Desk | 26 Sep 2018 7:08 AM GMTకొందరు నేతలు.. కొన్ని పార్టీలు అనుసరించే వైఖరి ఒకపట్టాన అర్థం కావు. తాజాగా తెర మీదకు వచ్చిన ఉదంతం కూడా అలాంటిదే. మజ్లిస్ కు హైదరాబాద్‌లోనే కాకుండా మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చెప్పబోయేది ఆ ఎమ్మెల్యేల్లో ఒకరైన వారిస్ పఠాన్. మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. మజ్లిస్ పార్టీ రూల్స్ ను అస్సలు బ్రేక్ చేయరు.
కానీ.. 2016 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయనందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కట్ చేస్తే.. తాజాగా జరిగిన గణపతి నవరాత్రుల సందర్భంగా ఆయనో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏమైందో ఏమో కానీ.. ఆయన నోటి నుంచి గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
మజ్లిస్ ఎమ్మెల్యే గారి నోటి నుంచి వచ్చిన ఈ నినాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ మాతాకీ జై అని నినాదం చేయటానికి ఇష్టపడని మజ్లిస్ ఎమ్మెల్యే.. గణపతి బప్పా మోరియా అంటున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. వీడియోక్లిప్ మజ్లిస్ అధిష్ఠానానికి చేరింది.
దీనిపై సదరు మజ్లిస్ ఎమ్మెల్యే నుంచి వివరణ కోరింది పార్టీ. తాను తప్పు చేశానని.. క్షమించాలంటూ మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎవరు అడిగారని నినాదం చేయటం.. ఆ తర్వాత తప్పు చేశామంటూ చెంపలు వేసుకోవటం ఏమిటి? ఈ లెక్కన ఇఫ్తార్ విందుకు ఎవరూ హాజరు కాకూడదన్నదే మజ్లిస్ ఆలోచనా? అదే విషయాన్ని బహిరంగంగా చెబితే బాగుంటుంది?.. ఏదో మనసుకు నచ్చిన మాట చెప్పినంతనే పాపం చేసినట్లు కాదు కదా? ఇంకా.. ఈ డిజిటల్ యుగంలోనూ మతాలు.. కులాలు అంటూ కోటలు కట్టుకోవటం అవసరమా?