Begin typing your search above and press return to search.
ఎంఐఎం కామెంట్లతో బాబుకు ఝలక్
By: Tupaki Desk | 11 Jan 2016 4:51 AM GMTహైదరాబాద్ సిర్ఫ్ హమారా అన్నట్లు వ్యవహరించే ఎంఐఎం పార్టీ కొత్త రాజకీయానికి తెరతీస్తోంది. నగరంలో మంచి జరిగితే తమ ఘనతే అని...అభివృద్ధి జరగకపోయినా, అవాంచనీయ ఘటనలు జరిగినా ప్రభుత్వం-పార్టీలపై తోసేసే ఎంఐఎం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. సరికదా ఇపుడు కొత్త కామెడీలకు తెరతీస్తోందని తెలుస్తోంది. పార్టీ నేతలను గ్రేటర్ ఎన్నికల్లో సమాయత్తం చేసేందుకు ఎంఐఎం ఏర్పాటు చేస్తున్న డివిజన్ల సమావేశాల్లో హైటెక్ సిటీ కూడా తామే అభివృద్ధి చేసినట్టు చెప్పుతోందట!
కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్న సమయంలో తాము హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని.. ఇపుడు ఆ ఫలాలు హైటెక్ సిటీ రూపంలో అందుతున్నాయని నాయకులకు ఎంఐఎం అగ్రనేతలు పార్టీ నేతలకు చెప్తున్నారు. ఇదే మాటలను ప్రచారంలో పెట్టాలని వారికి సూచిస్తున్నారట. పొరుగు రాష్ర్టాల్లో విస్తరణకు ఎంఐఎం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో గెలవడం అత్యంత ముఖ్యమని ఓవైసీ బ్రదర్స్ చెప్తున్నారు.
మత రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం ఇపుడు తెలంగాణకు చిహ్నంగా నిలిచిన హైటెక్ సిటీ అభివృద్ధి గురించి ఇలాంటి కామెంట్లు చేయడం టీడీపీ అధినేత-ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళితే ఆయన కూడా ఆశ్చర్యపోతారేమో. మరోవైపు ఇన్ని మాటలు చెప్తున్న ఓవైసీ సోదరులు ఓల్డ్ సిటీలో నరకప్రాయంగా ఉన్న మౌళిక సదుపాయాలు వాళ్ల పాలనలో ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందకపోవడంపై ఏం సమాధానం ఇస్తారో మరి.