Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బకు ఓవైసీ ఖేల్ ఖతం.. హిందూపూర్ తోనే సరి

By:  Tupaki Desk   |   14 March 2021 2:51 PM GMT
జగన్ దెబ్బకు ఓవైసీ ఖేల్ ఖతం.. హిందూపూర్ తోనే సరి
X
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అడుగుపెట్టి అక్కడ మెజార్టీ సీట్లు సాధించిన ఎంఐఎం పార్టీ ఏపీలో మాత్రం జగన్ సునామీలో కొట్టుకుపోయింది. ఏపీ మున్సిపల్ ఎన్నికలతో ఏపీలో ప్రవేశించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తన స్నేహితుడైన జగన్ తోనే తలపడ్డారు.

అయితే ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఎంఐఎం పార్టీ తేలిపోయింది. జగన్ పార్టీ దెబ్బకు కొట్టుకుపోయింది. కేవలం ఒక్క హిందూపూర్ లోని మున్సిపాలిటీలో మాత్రమే బోణీ కొట్టి బొక్కబోర్లా పడింది.

2021 మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా ముస్లిం జనాభా ఉన్న నాలుగు జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యూహాత్మకంగా కేవలం 47 వార్డుల్లోనే అభ్యర్థులను నిలిపారు. అయితే జగన్ పార్టీ దెబ్బకు ఎంఐఎం కేవలం ఒకే ఒక్క వార్డులో మాత్రమే గెలవగలిగింది.

ఈసారి ఎంఐఎం తొలిసారిగా అనంతపురం జిల్లాలోని హిందూపూర్ లో బోణికొట్టింది. హిందూపూర్ మున్సిపాలిటీ 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ ఏపీలో విస్తరిస్తోందని.. జగన్ కళ్లు మూసుకొని ఉంటున్నారని.. జగన్ చాపకింద నీరులా ఆయనను విస్తరించి జగన్ సీటుకు ఎసరు తెస్తోందని ఓవైసీ చేసిన విమర్శలను ఏపీ ఓటర్లు అస్సలు పట్టించుకోలేదు.

అయితే టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలనే ఎంఐఎం టార్గెట్ చేసిందని.. టీడీపీ ఓటు బ్యాంకును చీల్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ గెలుపునకు ఎంఐఎం దోహదపడిందన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబుకు ఎంఐఎం అధినేత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది.