Begin typing your search above and press return to search.
మజ్లిస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి
By: Tupaki Desk | 6 Jan 2016 10:17 AM GMTప్రస్తుత సీన్ః పాతబస్తీలో రాత్రికి రాత్రే కొత్త రోడ్లు పడుతున్నాయి. బస్తీల్లో మురుగునీరు ఏరులై పారడంలేదు. రోజు విడిచి రోజు మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి. చెత్త కుండీలను ప్రతి రోజూ ఎత్తివేస్తున్నారు. అభివృద్ధితో పాతబస్తీలోని గల్లీలు కళకళలాడుతున్నాయి. అంతే కాదు రోడ్లు - డ్రైనేజీ సమస్య - మంచినీరు - చెత్త ఎత్తివేసే కార్యక్రమాలు చేపడుతూనే ఇంకోవైపు ఎంఐఎం నేతలు పాదయాత్రలు ముమ్మరం చేశారు. పాతబస్తీ ప్రజలకు ఏ అవసరం వచ్చినా దారుసలాం మజ్లిస్ పార్టీ కార్యాలయానికి వచ్చి మాతో పనిచేయించుకోండని హామీలు గుప్పిస్తున్నారు.
సరిగ్గా నెలక్రితం వరకుః రెండేండ్ల క్రితం కురిసిన వర్షాలకు పాతబస్తీలో రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా గోతులమయమే. రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యేలు - మాజీ కార్పొరేటర్ల దృష్టికి ప్రజలు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఈ దారిగుండా నిండు గర్భిణీ స్త్రీ ఆటోలో వెళితే మార్గం మధ్యలోనే కాన్పు అయ్యే స్థితికి చేరాయంటే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. ఇక డ్రైనేజీ గురించి చెప్పనక్కర్లేదు. ఏ రోడ్డులో చూసినా సంవత్సర కాలంపాటు మురుగునీరు పారుతూనే ఉండేది. మ్యాన్ హోల్స్ మూతలు తెరిచినా పట్టించుకున్న పాపాన పోలేదు. మంచినీటి విషయాన్ని పరిశీలిస్తే వాటర్ వర్క్స్ సిబ్బందికి ఎప్పుడు తోచితే అప్పుడు వదిలేవారు. ఒక్కోసారి రోజు విడిచి రోజు లేదంటే మూడు నాలుగు రోజులకోసారి వదిలేవారు. ఇదేంటని అడిగే నాధుడు లేడు. ఒకవేళ నిలదీసినా మీ ఎంపీ - ఎమ్మెల్యేలకు చెప్పండి అంటూ మొండి సమాధానం. చెత్త కుండీలు ఉంటాయి కానీ, నిండుకున్నా వాటిని ఎత్తేవారు లేరు. దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునేవారు కాదు.
అయితే హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం గ్రేటర్ ఎన్నికలు. అయితే ఈ పనులన్నీ చేయిస్తున్నది అధికార టీఆర్ ఎస్ పార్టీ అనుకునేరు. కానే కాదు. పాతబస్తీ కింగ్ లుగా చెప్పుకునే ఎంఐఎం నేతలు! రెండేండ్లుగా పాతబస్తీ ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకోని మజ్లీస్ పార్టీకి బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లు గుర్తుకు వచ్చింది. దారుసలాంలోని మజ్లీస్ పార్టీ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోని నేతలకు బల్దియా ఎన్నికలు కనువిప్పు కలిగించింది. అదేంటి ఓల్డ్ సిటీ అంటే మజ్లీస్ అనేంతగా అక్కడి ఓటర్లున్నారు కదా అంటే ట్రెండ్ మారిపోవడం నాయకులకు స్పష్టంగా కనిపిస్తోంది మరి.
గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి అనుకూల పరిస్థితి ఉన్నదని పలు సర్వేలు వెల్లడిస్తుండటంతో మజ్లీస్ పార్టీకి భయం పట్టుకుంది. టీఆర్ ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని కనీసం 75 సీట్లు గెలుచుకొని బల్దియాలో అతి పెద్ద పార్టీగా అవతరించాలని ఎంఐఎం విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే టీఆర్ ఎస్ పొత్తులకు నో చెప్పడం, ఎంఐఎం రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తోందని సర్వేలో స్పష్టంగా తేలడంతో మజ్లీస్ నేతల్లో భయం పట్టుకున్నది. తమ ఆశలు అడియాశలవుతాయని భయపడుతున్న ఆ పార్టీ నేతలు సర్వే ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
పాతబస్తీలో 45 సీట్లు ఎలాగో వస్తాయనే నమ్మకం సడలిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలపై దృష్టిసారించారు. అంబర్ పేట - ఖైరతాబాద్ - జూబ్లీహిల్స్ - రాజేంద్రనగర్ - మహేశ్వరం - శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో నివాసం ఉంటున్న ముస్లింల మద్దతు పొందితే 25 నుంచి 30 సీట్లు దక్కించు కోవచ్చన్న ఉద్దేశంతో పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ - ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ కలిసి ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మాజీ కార్పొరేటర్లు - కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల మద్దతు ఏ విధంగా పొందాలనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో చౌకీ సభలు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం ప్రారంభించారు. దీంతో సాధారణ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మజ్లీస్ పార్టీ నేతలు పాతబస్తీవైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు ఓటమికి కారణం కావచ్చన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మొజంఖాన్, జాఫర్‌హుస్సేన్ మేరాజ్, మాజీ కార్పొరేటర్ల చేత పాదయాత్రలు, చౌకీ సభలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
మజ్లీస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువకులు పెడదోవ పట్టకుండా మజ్లీస్ పార్టీలో చేరి సైనికుల్లా పనిచేసి కనీసంగా 75 సీట్లు గెలిపించాలని, ఆ సత్తా మీలో ఉందని ఉసిగొల్పుతున్నారు. మజ్లీస్ పార్టీకి తిరుగులేకపోవడంతో పాతబస్తీలో ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తూ వచ్చి ఏ సమస్య వచ్చినా ఆ పార్టీ నేతలే దిక్కయ్యారు. కానీ ఎన్నికలు రావడం, సర్వేలు చుక్కలు చూపించడం వారిని నేలకు తీసుకువచ్చిందని ఓల్డ్ సిటీ ఓటర్లు చెప్పుకొస్తున్నారు.