Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై మైండ్ గేమ్
By: Tupaki Desk | 11 Nov 2021 7:30 AM GMTప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతోంది. చంద్రబాబుకు బద్ధ శతృవైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో గెలుపు బాధ్యతలను అప్పగించటం జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమనే చెప్పాలి. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నారు. తనపై వైసీపీ వాళ్ళ మైండ్ గేమ్ పనిచేయదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ పనిచేయటం ఎప్పుడో మొదలుపెట్టింది. అందుకనే ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారు.
అందుకనే అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డికి ప్రత్యేకంగా కుప్పంలో జగన్ బాధ్యతలు అప్పగించారు. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేకమైన దృష్టిపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి కొడుకు భరత్ కే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు ఎక్కువ. అందుకనే పై రెండువర్గాలతో పాటు మిగిలిన సామాజికవర్గాలను కూడా లక్ష్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలను భరత్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
పెద్దిరెడ్డి మార్గదర్శకత్వంలో భరత్ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే పంచాయితీల్లో కానీ పరిషత్ ఎన్నికల్లో గానీ అధికారపార్టీ మద్దతుదారులు, వైసీపీనే క్లీన్ స్వీప్ చేసేసింది. ఇదే ఊపులో ఇఫుడు మున్సిపల్ ఎన్నికను కూడా గెలవాలన్నది వీళ్ళ ప్లాన్. కుప్పం మున్సిపాలిటిని కూడా గెలవటం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలన్న వ్యూహాన్ని పెద్దిరెడ్డి దగ్గరుండి మరీ అమలు చేస్తున్నారు.
టీడీపీలోని కొందరు కీలక నేతలను తమపార్టీలోకి పెద్దిరెడ్డి చేర్చేసుకున్నారు. ప్రత్యర్ధిపార్టీ నేతల బలహీనతలనే తన బలంగా ఇంతకాలం చంద్రబాబు చెలాయించారు. అందుకనే ఇపుడు చంద్రబాబుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని పెద్దిరెడ్డి గట్టిగా నియోజకవర్గంలో కూర్చున్నారు. అందుకనే వారంలో కనీసం రెండు రోజులు కుప్పంలో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు. పెద్దిరెడ్డి+భరత్ కష్టానికి స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఫలితం కనిపించింది.
ఇదే ఫలితాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యుచేస్తూ చంద్రబాబును పూర్తిగా దెబ్బకొట్టాలని డిసైడ్ చేసుకున్నారు. చంద్రబాబేమో రెండు రోజులు కుప్పంలో పర్యటించి వెళ్ళిపోయారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం కుప్పంలో ప్రతిరోజు పర్యటిస్తునే ఉన్నారు. ప్రచారంలో ఇదే విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. రేపు కుప్పంలో టీడీపీ గెలిచినా చంద్రబాబు కుప్పం జనాలకు అందుబాటులో ఉండరని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో చంద్రబాబుపై మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. మరి జనాలు ఎవరి మాట వింటారో చూడాలి.